వీఐటీ చాన్స్‌లర్‌కు గౌరవ డాక్టరేట్
వేలూరు: వేలూరు వీఐటీ వ్యవస్థాపకులు, చాన్స్‌లర్ విశ్వనాథన్‌కు న్యూయార్క్‌లోని రోచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. భారతదేశ వ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ విద్యను విస్తరించడంలో ఆయన నాయకత్వం, ఆర్థికంగా వెనుకబడిన వారికి మద్దతు ఇవ్వడంలో ఆయన అంకితభావానికి రోచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్య సీనియర్ అధికారి డాక్టర్ డేవిట్ మున్సన్, విద్యా వ్యవహారాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రభు డేవిడ్, విశ్వనాథన్‌కు గౌరవ డాక్టరేట్ డిగ్రీ పట్టాను అందజేశారు. ఈ గుర్తింపు అమెరిక్ యూనివర్సిటీ నుంచి ఒక భారతీయుడికి గౌరవ డాక్టరేట్ లభించడం ఇది మూడోసారి. గతంలో వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్‌కు 2009లో యూఎస్‌లోని వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ, 2024లో యూఎస్‌లోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశాయి. 2025వ సంవత్సరంలో కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. చాన్స్‌లర్ విశ్వనాథన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలుపుతూ తనకు గత వారం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన ఆర్‌ఐటీకి కృతజ్ఞతలు తెలిపారు. వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్, శేఖర్, వైస్ చాన్స్‌లర్ కాంచన, అంతర్జాతీయ సంబంధాల డైరెక్టర్ ఆర్.శ్రీనివాసన్ పాల్గొన్నట్లు ప్రకటనలో తెలిపారు.


