● ప్రస్తుతం ఉన్నది ద్రావిడ మోడల్‌ పార్ట్‌ –1 ● అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ ● కాలనీ పదం వినియోగంపై నిషేధం | - | Sakshi
Sakshi News home page

● ప్రస్తుతం ఉన్నది ద్రావిడ మోడల్‌ పార్ట్‌ –1 ● అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ ● కాలనీ పదం వినియోగంపై నిషేధం

Apr 30 2025 12:24 AM | Updated on Apr 30 2025 12:24 AM

● ప్ర

● ప్రస్తుతం ఉన్నది ద్రావిడ మోడల్‌ పార్ట్‌ –1 ● అసెంబ్లీ

తమిళనాడు, తమిళుల కోసం, వారి హక్కుల సాధన ప్రయాణంలో ఇప్పటి వరకు ద్రావిడ మోడల్‌ పాలన పార్ట్‌ –1ను చూస్తున్నారని.. 2026 లో వెర్షన్‌ 2ఓ పాలన ఉంటుందని సీఎం స్టాలిన్‌ అన్నారు. ఇది తాజాగా లోడ్‌ అవుతోందని, మరిన్ని విజయాలు సృష్టించి తమిళనాడు చరిత్రను తిరగ రాస్తామని ధీమా వ్యక్తం చేశారు.

సాక్షి, చైన్నె : నెలన్నర రోజులు జరిగిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజున తన పరిధిలోని పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖకు నిధుల కేటాయింపునకు సంబంధించిన అంశాలు, పాలసీలు, కొత్త ప్రకటనల గురించి అసెంబ్లీ వేదికగా సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం ఆరవ సారిగా అధికారంలోకి వచ్చి నాలుగో సంవత్సరాన్ని పుర్తి చేసుకుని , ఐదవ సంవత్సరంలో అడుగు పెట్టే స్వర్ణయుగం ప్రారంభం త్వరలో కాబోతోందన్నారు. ముత్తువేల్‌ కరుణానిధి స్టాలిన్‌ అను నేను అని బాధ్యతలు స్వీకరించిన రోజైన మే 7వ తేదీకి మరో ఏడు రోజులే సమయం ఉందని వ్యాఖ్యానించారు.

ఈ నాలుగేళ్ల కాలంలో ఇప్పటివరకు విజయవంతంగా అమలు చేసిన ఎన్నో పథకాలే ఏడవ సారి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశంగా నిలుస్తుందన్న నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. 60 సంవత్సరాల ప్రజా జీవితంలో ఒక్క మాట చెప్పాలంటే, దివంగత నేత కలైంజ్ఞర్‌ వలే పయనిస్తూ, స్టాలిన్‌ అంటే శ్రమ– పని – పని , ‘స్టాలిన్‌ అంటే సాధన – సాధన –‘ అని గుండె చరిచి గాంభీర్యంగా మరెన్నో విషయాలను సభలో తెలియజేయాలనుకుంటున్నట్టు వివరించారు. గత పాలకులు చేసిన పరిపాలనా అవినీతి మయం అని గుర్తు చేస్తూ తన మీదున్న నమ్మకంతో తమిళనాడు ప్రజలు ఆ ప్రభుత్వాన్ని గద్దె దించారని పేర్కొన్నారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేశంలో ఏ ఇతర రాష్ట్రం సాధించని ఘనతను ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం సొంతం చేసుకున్నట్టు ప్రకటించారు. 2024–25లో 9.69 శాతం ఆర్థిక వృద్ధిని సాధించి దేశంలోనే నెంబర్‌ 1 రాష్ట్రంగా తమిళనాడు నిలిచినట్టు ధీమా వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లోనూ రికార్డులు, ఉన్నత విద్యలో రికార్డు అంటూ ఎన్నో రికార్డులను సృష్టించామని వివరించారు. తమిళనాడులో దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న వారి జీవన పరిస్థితులు మెరుగు పడ్డాయని, మెరుగైన వైద్య అందరికి దరి చేరినట్టు , పారిశ్రామిక ప్రగతి సాధించినట్టు, మహిళల భాగస్వామ్యం పెరిగినట్టు , స్టార్టప్‌ ర్యాంకింగ్స్‌లో ౖపైపెకి చేరినట్టు, నూనె గింజలు, వేరుశనగ , చెరకు ఉత్పత్తి సామర్థ్యంలో మొదటి స్థానానికి చేరినట్టు వివరించారు.

పోలీసు దినోత్సవం

సమష్టి కృషి..

తన ప్రసంగంలో సీఎం స్టాలిన్‌ తమిళనాడు పథకాలు, ప్రగతి ప్రాజెక్టులు, విజయాలను వివరిస్తూ, ఇది ఇంకా పూర్తి కాలేదని, కొనసాగాల్సి ఉందని వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా పైన పాము – కింద నక్కలు... పరుగెడితే గుంటలో పడతాం ఈ రకంగా వీటి మధ్యలో చిక్కుకున్న వ్యక్తి తరహాలో తన ప్రభుత్వ పరిస్థితి ఉందన్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం వైఖరిని, మరోవైపు గవర్నర్‌ రూపంలో అడ్డంకులను , ఇంకో వైపు ఆర్థిక సంక్షోభం అధిగమిస్తూ విజయాల వైపుగా దూసుకెళ్తున్నామన్నారు. ఈ విజయాలన్ని స్టాలిన్‌ అనే ఒక వ్యక్తి సాధించినవి కావు అని, నా మంత్రివర్గం, అధికారుల సమష్టి కృషికి ఫలితంగా వివరించారు. ఇది వరకటి ప్రభుత్వాలను కామరాజ్‌ ప్రభుత్వం – అన్నా ప్రభుత్వం – కలైంజ్ఞర్‌ ప్రభుత్వ అని సంభోధించే వారని, అయితే, తనది ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు. తమిళ సమాజం, సంస్కృతి, హక్కులు, ఆత్మ గౌరవం, సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం, సమైఖ్య వాదం, మరిన్ని అధికారాలు కలిగిన రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కాలనీ అన్న పదం గురించి సీఎం స్టాలిన్‌ గుర్తు చేస్తూ అంటరానితనానికి గుర్తింపుగా మారిన ఈ పదం ఇక ప్రభుత్వ పరంగా గానీ, ఇతర అంశాలలో గాని వాడకం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.

2026లో

శాంతి వనం

తమిళనాడు ప్రశాంత పూరితంగా శాంతివనంగా ఉన్నట్టు, అందుకే వివిధ పరిశ్రమల యాజమాన్యాలు ఇక్కడకు తరలి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. విద్య పరంగా మహిళలు, యువతలో పురోగతి , క్రీడా రంగం బలోపేతం, ఉత్పత్తి, ఎగుమతుల పెంపు, పర్యాటకం, దేవాలయాలు...ఇలా ప్రతి చోట పోలీసు అన్న శాంతి భద్రతల అంశం ఉంటుందన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో తమిళనాడు పోలీసుల పాత్ర అభినందనీయమని, ఇక్కడ ఎలాంటి అల్లర్లు, కుల, మత ఘర్షణలకు చోటు లేదని స్పష్టం చేశారు. కొందరు కొన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా తమిళనాడు ప్రజలే వాటిని తిప్పి కొట్టారన్నారు. కొందరైతే తాను పట్టుకున్న కుందేలుకు మూడు కాళ్లే ఉన్నాయని వాదిస్తుంటారని, అలాంటి వారి విమర్శలు, ఆరోపణలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇది మణిపూర్‌ కాదు! , ఇది కాశ్మీర్‌ కాదు!, ఉత్తరప్రదేశ్‌ కుంభమేళా మరణాలు ఇక్కడ జరగలేదు! , ఇది తమిళనాడు! అన్నది ఎన్నడూ మరచిపోవద్దు అని హెచ్చరించారు. పోలీసు శాఖను ఆధునీకరించే ప్రయత్నాల గురించి ఈసందర్భంగా వివరించారు. నేరాలు, నేరస్థులను గుర్తించడానికి ఒక ఆధునిక నెట్‌వర్క్‌ ఈ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నామని ఫ్రకటించారు. ప్రజలు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను నమోదు చేయడం, విభాగాల మధ్య సమాచారాన్ని పంచుకోవడం, సైబర్‌తో సహా అన్ని నేరాల నియంత్రణకు ఈ వ్యవస్థ మరింత దోహదకరంగా ఉంటుందన్నారు.

1859లో మద్రాస్‌ జిల్లా పోలీసుల వ్యవస్థ ఆధునీక చట్టాన్ని అమలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇక ఏటా సెప్టెంబరు 6వ తేదీని పోలీసు దినోత్సవంగా జరుపుకుంటామని, ఈరోజున విధి నిర్వహణలో విశిష్ట సేవలను అందించిన వారిక పతకాలనుప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. ‘‘తమిళనాడు నేరం లేని రాష్ట్రం! డ్రగ్స్‌ కదలిక లేని రాష్ట్రం! లైంగిక నేరాలు లేని రాష్ట్రం!’’ అన్న లక్ష్యాన్ని చేరుకోవడం ఇక ముందున్న కర్తవ్యంగా పేర్కొంటూ, నేరాలకు పాల్పడే వారెవ్వరైనా సరే ఉపేక్షించకుండా అరెస్టు చేసి, శిక్ష పడేలా చేయడంలో తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలు పలువురు తన ముందు ఉంచిన డిమాండ్లు, సమస్యలను ప్రస్తావిస్తూ అమలుకు విస్తృత చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దశాబ్దం కాలం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే కంటే వెయ్యిరెట్లు సుపరిపాలనను అందించి అన్ని రంగాలలోనూ ఇజయాలను సాధించామని, ఈ దృఢ సంకల్పంతో , ప్రజలపై నమ్మకంతో తాను చెబుతున్నానని తమిళనాడును తాకట్టు పెట్టే ప్రయత్నం చేసే వారిని, దోచుకోవాలన్న లక్ష్యంతో ఉన్న వారిని ఇక్కడ పాదం మోప నివ్వను అని స్పష్టం చేశారు. ఇంత వరకు ద్రావిడ మోడల్‌ పాలన పార్ట్‌ –1 మాత్రమే చూశారని గుర్తు చేశారు. ఇక, 2026లో వెర్షన్‌ 2.ఓ లోడ్‌ అవుతోందని, ఇందులో మరిన్ని విజయాలను సృష్టించ బోతున్నామంటూ తమిళం వర్థిల్లాలి, తమిళనాడు వర్థిల్లాలి అన్న నినాదం హోరెత్తించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రధాన ప్రతి పక్ష నేత పళణి స్పందిస్తూ, 2026 అన్నాడీఎంకే వెర్షన్‌ అధికారంలోకి రాబోతోందని స్టాలిన్‌...బై...బై అన్న నినాదాన్ని ప్రజలు ఇప్పుడే అందుకునేశారని వ్యాఖ్యలు చేశారు.

● ప్రస్తుతం ఉన్నది ద్రావిడ మోడల్‌ పార్ట్‌ –1 ● అసెంబ్లీ1
1/1

● ప్రస్తుతం ఉన్నది ద్రావిడ మోడల్‌ పార్ట్‌ –1 ● అసెంబ్లీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement