శ్రీవారి ఆలయంలో చలువ పందిళ్లు
రాపూరు: మండలంలోని పెంచలకోన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయం చుట్టూ భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటుచేసినట్టు అధికారులు తెలిపారు. వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో భక్తులకు కాళ్లు కాలకుండా ఉండేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఆర్టీసీ బస్టాండు నుంచి ఆలయం వరకు, అన్నదాన సత్రం తదితర ప్రాంతాల్లోనూ పందిళ్లు వేస్తున్నట్టు తెలిపారు. అలాగే శ్రీవారి ఆలయం నుంచి అమ్మవారి ఆలయం వరకు తెల్ల సున్నం, పట్ట వేసినట్టు వెల్లడించారు.


