
కంట్రోల్ రూమ్‌ను ప్రారంభిస్తున్న డీఐజీ ముత్తుస్వామి, ఎస్పీ కిరణ్ శృతి
వేలూరు: సరిహద్దులోని చెక్‌పోస్టుల వద్ద అత్యాధునిక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వేలూరు డీఐజీ ముత్తుస్వామి అన్నారు. రాణిపేట జిల్లా సరిహద్దు ప్రాంతంలో తామరపాక్కం, ఆమలూరు పోలీస్ స్టేషన్‌లున్నాయి. ఈ పోలీస్ స్టేషన్‌ల సరిహద్దు ప్రాంతంలలో శంకరన్‌పాళ్యం సత్రం వంటి ప్రాంతాల్లో మొత్తం తొమ్మిది చెక్‌పోస్టుల్లోని కంట్రోల్ రూమ్, నిఘా కెమెరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన కంట్రోల్ రూమ్‌లో చేపడుతునన్ విషయాలను రాణిపేట ఎస్పీ కార్యాలయం నుంచి పరిశీలించారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాలు, చోరీలు అధికంగా జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం గత నెలలో పోలీస్ శాఖలో విశిష్ట సేవలందించిన పోలీసులను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ శృతి, అదనపు ఎస్పీ విశ్వనాథ్, డీఎస్పీ రవిచంద్రన్ పాల్గొన్నారు.