
తిరువళ్లూరులో మాలధారణ చేస్తున్న భక్తులు
వేలూరు: ప్రతి సంవత్సరం కార్తీక మాసం మొదటి రోజున అయ్యప్ప భక్తులు మాలలు ధరించి 48 రోజుల పాటు దీక్షలో ఉంటూ శబరిమలైకి వెల్లడం ఆనవాయితీ. శుక్రవారం ఉదయం కార్తీకమాసం మొదటి రోజు కావడంతో వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై జిల్లాల్లో వేకువజామున భక్తులతో అయ్యప్ప ఆలయానికి వెళ్లారు. అనంతరం గురస్వామి ఆధ్వర్యంలో క్యూలో నిలిచి అయ్యప్ప మాల ధరించారు.
తిరువళ్లూరులో..
తిరువళ్లూరు: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తులు శుక్రవారం ఉదయం మాలధారణ చేసి తమ ఉపవాసాన్ని ప్రారంభించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో అయ్యప్ప మాల వేసే భక్తులు 42 రోజులపాటు ఉపవాసం ఉండి ఇరుముడితో వెళ్లి అయ్యప్పస్వామికి మొక్కులు చెల్లిస్తారు. జిల్లాలోని శివాలయాల్లో బారులు తీరిన భక్తులు అయ్యప్పమాల ధారణ చేశారు.