తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

Nov 27 2026 4:08 AM | Updated on Nov 27 2026 4:08 AM

హుజూర్‌నగర్‌ : రాబోయే రోజుల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం హుజూర్‌నగర్‌లోని మండల పరిషత్‌ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తాగునీటి అవసరాలకు సంబంధించి అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. వాటికి త్వరలో అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చూడాలని సూచించారు. పైపుల ద్వారా నీరు సరఫరా కాని ప్రాంతాల్లో ట్యాంకర్లు ఏర్పాటు చేయాలన్నారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించడంపై శ్రద్ధ చూపాలన్నారు. కాల్వల తవ్వకం, చెరువుల పనులు, మొక్కలు నాటడం వంటి పనులు చేపట్టాలని సూచించారు. జలసిరి, వ్యక్తిగత, సామూహిక పనులతోపాటు స్వచ్ఛభారత్‌ మిషన్‌న్‌ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పర్యాటక ప్రాంతాలు, ఆలయాల వద్ద తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించేలా పనులను చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, ఆర్‌డీఓ శ్రీనివాసులు, ఎంపీడీఓలు సుమంత్‌రెడ్డి, లక్ష్మి, తహసీల్దార్‌ హరిప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు.

మోడల్‌ కాలనీ పరిశీలన

హుజూర్‌నగర్‌ పరిధిలోని రామస్వామిగట్టు వద్ద నిర్మించిన మోడల్‌ కాలనీని కలెక్టర్‌ పరిశీలించారు. ఇళ్ల సముదాయాల్లో మిగిలిపోయిన పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం హుజూర్‌నగర్‌ శివారులో రైతులు సాగు చేస్తున్న ఉలవలు, మినుము పంటలను పరిశీలించారు. రైతులు వరిసాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ఆయన వెంట హౌసింగ్‌ పీడీ జబ్బార్‌, ఆర్‌డీఓ శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ సతీష్‌, ఏఓ స్వర్ణ, ఏఈఓ ప్రియాంక, తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement