సూర్యాపేట(చివ్వెంల) : భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్ పి.శివరాం ప్రసాద్ అన్నారు. గురువారం జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భారత దేశంలో ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వాలు పాలన సాగిస్తాయన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ, హక్కులను పొందాలని సూచించారు. రాజ్యాంగ రచనతో ఎంతో మంది మేథావులు భాగస్వాములయ్యారని, ఆందులో బీఆర్ అంబేద్కర్ కృషి అత్యంత ముఖ్యమైనదన్నారు. ఆయన కృషి వల్లే రాజ్యాంగం అమలు జరిగి, మనకు అన్ని రకాల హక్కులు అందాయనిన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదువుతూ ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి శివరాంప్రసాద్


