వీబీజీ రామ్‌జీతో కూలీలకు నష్టం | - | Sakshi
Sakshi News home page

వీబీజీ రామ్‌జీతో కూలీలకు నష్టం

Nov 27 2026 4:14 AM | Updated on Nov 27 2026 4:14 AM

సూర్యాపేట(భానుపురి): వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేసి ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనుంజయ నాయుడు డిమాండ్‌ చేశారు. గురువారం కలెక్టరేట్‌ ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఉపాధిహామీ పథకాన్ని కమ్యూనిస్టులు పోరాడి తీసుకొచ్చారని తెలి పారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్‌జీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి బడ్జెట్‌లో నిధులు తగ్గించిందన్నారు. దాంతో వ్యవసాయ కార్మికులు, పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కూలీలకు 200 రోజుల పనిదినాలను కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రెమిడాల రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు నీలం నాగభద్రం, సహా య కార్యదర్శి రావుల సత్యం, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంబాల శ్రీనివాస్‌, చిలకరాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement