చెక్‌డ్యామ్‌తో వాగుకు జలకళ | - | Sakshi
Sakshi News home page

చెక్‌డ్యామ్‌తో వాగుకు జలకళ

Nov 27 2026 4:14 AM | Updated on Nov 27 2026 4:14 AM

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : ఆత్మకూరు.ఎస్‌ మండల పరిధిలోని పాతర్లపహాడ్‌ నుంచి మక్తా కొత్తగూడెం గ్రామాల వరకు ప్రవహించే బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లతో పరిసర గ్రామాల్లో రైతుల బోరు బావులు, భూగర్భ జలాలు పెరిగి జలకళను సంతరించుకుంటున్నాయి. వర్షాకాలంలో బిక్కేరు వాగు నుంచి ప్రవహించే వరద నీరు వృథాగా పాలేరుకు చేరేది. గత ప్రభుత్వం ఈ నీటిని ఒడిసిపట్టి నీరంతా వృథాగా కిందికి పోకుండా చేసి, ఇక్కడే రైతుల అవసరాలు తీర్చేందుకు మండల పరిధిలో 9 చెక్‌డ్యామ్‌లను నిర్మించింది. మూడు, నాలుగు సంవత్సరాలుగా ఈ చెక్‌డ్యామ్‌లతో నీరు నిలుస్తుండడంతో భూగర్భ జలాలు పెరిగాయని పరిసర గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా వరి సాగు విస్తీర్ణం కూడా పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. గతంలో వేసవి కాలంలో పశువులకు నీళ్లు దొరక ఇబ్బందులు పడేవాళ్లమని తెలిపారు. నీరు లేకుండా చేసి ఎక్కడికక్కడ ఇసుక మాఫియా ఇసుకను తరలించేవాళ్లని, చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో ఇసుక తరలింపు తగ్గిపోయిందని పేర్కొ న్నారు. దాంతో పాటు చెక్‌డ్యామ్‌ల వద్ద నీరు నిలిచి ఉండటంతో బోర్లు, బావులు నీటితో కళకళలాడుతున్నాయని పేర్కొంటున్నారు.

బిక్కేరు వాగుపై నీటితో

కళకళలాడుతున్న చెక్‌డ్యాం

చెక్‌ డ్యామ్‌లో మోటార్లు తొలగించాలి

బిక్కేరు వాగుపై చెక్‌ డ్యామ్‌ల నిర్మాణంతో వాగు వెంట ఉన్న గ్రామాల్లో వ్యవసాయ బోర్లు బాగా పోస్తున్నాయి. ఇటీవల కొందరు చెక్‌ డ్యామ్‌లలో అక్రమంగా మోటార్లు బిగిస్తున్నారు. వాటిని తొలగిస్తే చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటికి ఇబ్బందులు ఉండవు.

– భయ్యా లింగయ్య, ముక్కుడుదేవులపల్లి

చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో పెరిగిన భూగర్భ జలాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement