‘సర్‌’పై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’పై అప్రమత్తంగా ఉండాలి

Jun 15 2026 7:22 AM | Updated on Jun 15 2026 7:22 AM

కోదాడ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌–ఎస్‌ఐఆర్‌) జరుగుతున్నందున పార్టీ శ్రేణులు, బూత్‌ లెవల్‌ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. ఆదివారం కోదాడలోని గుడుగుంట్ల అప్పయ్య పంక్షన్‌హాల్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల బూత్‌స్థాయి నాయకులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు పరిగి ఎమ్మెల్యే రాంమ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో కలిసి ఆమె హాజరై మాట్లాడారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత బూత్‌ లెవల్‌ నాయకులకు ఉందని, ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించవద్దని కోరారు. టీపీసీసీ నుంచి వచ్చిన ప్రత్యేక బృదం దీనిపై నాయకులకు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement