శివానుగ్రహం కోసం 12 ఏళ్లుగా నిలబడి దీక్ష?! నెటిజన్లు షాక్‌! | Indian Sadhu Stands 12 Years For Lord Shiva Video Goes Viral On Social Media, Sparks Health Concerns | Sakshi
Sakshi News home page

శివానుగ్రహం కోసం 12 ఏళ్లుగా నిలబడి దీక్ష?! నెటిజన్లు షాక్‌!

Jun 17 2026 5:32 PM | Updated on Jun 17 2026 5:50 PM

Man Stands 12 Years As A Vow To God Shiva Netizens shocked

పరమ శివుడి అనుగ్రహం కోసం ఏళ్ల తరబడి తపస్సు చేసిన మునులు, మహర్షుల గురించి విన్నాం. కానీ కలియుగ భారతంలో శివానుగ్రహం కోసం ఏకంగా పుష్కరం కాలం నిలబడి  పోయిన వైనం నెట్టింట వైరల్‌గా మారింది.  హర్యానాకు చెందిన సాధువు 'దులాల్ గిరి జీ మహారాజ్' కి  సంబంధించిన ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

కొన్ని నివేదికల ప్రకారం ఆ సాధువు కనీసం  కూర్చోకుండా 12 ఏళ్ల నుంచి నిలబడే దీక్ష  సాగిస్తున్నారు. గడిచాయి.'తాజా టీవీ' (Taaza TV) ప్రకారం, దులాల్ గిరి జీ మహారాజ్ శివుని సేవలో తరించడానికి చిన్న వయసులోనే యూనివర్సిటీ చదువును వదిలిపెట్టారు. హిందూ సాధువులలో సాధారణంగా కనిపించే వేషధారణలో, పైభాగంలో ఎలాంటి  అచ్ఛాదన లేకుండా తలపై జడలతో  నడుము చుట్టూ కాషాయ వస్త్రంతో కనిపిస్తున్నారు. 

ఒక వీడియోలో గొలుసులతో పైకప్పు నుండి వేలాడుతున్న ఒక చెక్క పలకపై తన శరీరాన్ని ఆనించి ఉండగా, ఆలయ వాలంటీర్లు అతని కాళ్లకు లేపనం రాస్తున్నారు. మరో వీడియోలో కాషాయ వస్త్రాల్లో కేవలం గోడకు ఆనుకుని ఉండడం కనిపిస్తోంది. దీంతో అసలు ఈ సాధువు నిజంగానే శివుడికోసం దీక్ష చేస్తున్నారా? లేక అనారోగ్య కారణాలతో ఇలా మారిపోయారా అనేదానిపై పూర్తి స్పష్టత లేదు.  ఈవీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ రావడం గమనార్హం.

ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఆయన కాళ్లు వేళ్ల నుండి పిక్కల వరకు నల్లగా మారిపోయాయి,  తీవ్రంగా వాచిపోయి ఉన్నాయి. ఈయన్ని చూసి  నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశాడు. 

కొంతమంది నెటిజన్లు  సాధువు అంకితభావాన్ని, క్రమశిక్షణను ప్రశంసిస్తూ, ఇది విశ్వాసానికి ఒక అద్భుతమైన నిదర్శనమని పేర్కొన్నారు. మరికొందరు  తీవ్ర అసంతృప్తి వ్యక్తం  చేశారు.   బహుశా అతని కాళ్లకు  ప్రమాదకరమైన గాంగ్రీన్‌ సోకి ఉంటుందని, ఇలాగే  కొనసాగితే, కాళ్లను తొలగించాల్సి వస్తుంద అంటే, ఆయన ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement