ఎయిరిండియాకు తృటిలో తప్పిన ప్రమాదం | Air India flight suffers bird hit while landing at Raipur Airport lands safely | Sakshi
Sakshi News home page

ఎయిరిండియాకు తృటిలో తప్పిన ప్రమాదం

Jun 17 2026 6:09 PM | Updated on Jun 17 2026 6:21 PM

Air India flight suffers bird hit while landing at Raipur Airport lands safely

ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా భయాంలోళనలు నెలకొన్నాయి.

రాయ్‌పూర్ విమానాశ్రయ అథారిటీ ప్రకారం, విమానం ల్యాండింగ్ అవుతున్నప్పుడు  అకస్మాత్తుగా పక్షి ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ప్రయాణీకులకు గానీ, సిబ్బందికి గానీ ఎటువంటి గాయాలు కాకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన జరిగిన వెంటనే, పరిస్థితిని అంచనా వేయడానికి, ఇతర భద్రతా ప్రమాణాలనునిర్ధారించడానికి ఎయిరిండియా నిర్దేశిత చర్యలు చేపట్టింది.విమానయాన భద్రతా నియమాలకు అనుగుణంగా అవసరమైన తనిఖీలు చేపట్టినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తైన అనంతరం విమానానికి అనుమతి లభించిందని విమానాశ్రయ అథారిటీ ధృవీకరించింది.

ఇదీ చదవండి: అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్‌ డ్రైవర్‌గా ఇపుడు లక్ష

పక్షులు ఢీకొట్టడం అనేది విమానయానాల్లో పెద్ద ప్రమాదం. ఇటువంటి సంఘటనల తర్వాత, విమానం తిరిగి సేవలను ప్రారంభించే ముందు గాలిలో ప్రయాణించడానికి యోగ్యంగా ఉందని నిర్ధారించుకొనేందుకుగాను  విమానయాన సంస్థలు వివరణాత్మక తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది.  

ఇదీ చదవండి: శివానుగ్రహం కోసం 12 ఏళ్లుగా నిలబడి దీక్ష?! నెటిజన్లు షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement