ఉత్తరాంద్ర సంప్రదాయాన్ని అనిత కాలరాస్తున్నారు: అమర్నాథ్ | Anitha is trampling on the traditions of Uttarandhra: Amarnath | Sakshi
Sakshi News home page

ఉత్తరాంద్ర సంప్రదాయాన్ని అనిత కాలరాస్తున్నారు: అమర్నాథ్

Jun 17 2026 12:34 PM | Updated on Jun 17 2026 3:23 PM

Anitha is trampling on the traditions of Uttarandhra: Amarnath

సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి గుడివాడ్‌ అమర్నాథ్‌ తానెప్పుడూ మహిళల గురించి అవమాన కరంగా మాట్లాడలేదని, మా మీద, మా నేత మీద ​మాట్లాడిన మాటలకు ఖండించానని విశాఖపట్నంలో అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఇలా మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. ఉత్తరాంద్ర సంప్రదాయాన్ని మంత్రి అనిత కాలరాస్తున్నారని అమర్నాథ్‌ అన్నారు. టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడలేదు. నేను మాట్లాడిన మూడు రోజులు తర్వాత రాజకీయం చేస్తున్నారు. మా సోషల్ మీడియా దేవుళ్ళు వలన గతంలో టీడీపీ నేతలు మాట్లాడిన వీడియోలు మళ్ళీ బయటకు వచ్చాయి. మహిళలు అంటే గౌరవం నాకు ఉందని అమర్నాథ్‌ పేర్కొన్నారు. 

నాపై, మా నాయకుడు పై విమర్శలు చేసిన వారి గురించే విమర్శలు చేశాను. నా మాటలకు నేను కట్టుబడి ఉన్నాను. నా పై విమర్శలు చేసిన వారిపై తప్పితే యావత్ మహిళలు కోసం నేను మాట్లాడలేదు. రాజకీయ లబ్ధి కోసం ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మూడు తరాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి నేను వచ్చాను. వాడు వీడు అంటూ ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్న ఆమె మాట్లాడవచ్చా. మాజీ సీఎం తల్లి విజయమ్మ, భార్య భారతమ్మ గురించి దారుణంగా మాట్లాడింది.  విజయమ్మ భారతమ్మ పై చేసిన విమర్శలు టీడీపీ నేతలకు కనిపించలేదా. వైఎస్ జగన్ ను నత్తి పకోడీ అంటూ మాట్లాడింది. మేము తగిన సమాధానం చెప్పకపోతే ఆమె మరింత పెట్రేగి పోతారు. ఉత్తరాంధ్ర సాంప్రదాయాన్ని కాపాడే ప్రయత్నం చేశాని ఆయన అన్నారు. 

మా నాన్న మరణం తరువాత నన్ను, నా అక్కను నా తల్లి పెంచింది. నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళ మధ్య పెరిగిన వాడిని. నన్ను చిన్నతనం నుంచి తీర్చి దిద్దింది మహిళలు. నా గురించి మా పార్టీ మహిళలను అడుగు చెపుతారు. నీ లాంటి వాళ్ళకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో చంద్రబాబు,అనితా, చింతమనేని, బాలకృష్ణ, బండారు సత్యనారాయణ, గాలి భాను ప్రకాష్ మహిళలు గురించి ఎలా మాట్లాడారో తెలియదా.. అనిత ఏది పడితే అది మాట్లాడుతాను అంటే కుదరదు.. రాష్ట్రంలో కాదు దేశ అంతర్జాతీయ స్థాయిలో పిర్యాదు ఇచ్చుకొండి.. మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. తగ్గేదిలేదు.. ఒక యువకుడిని కాల్చి చంపారు.. దాని గురించి సమాధానం లేదని అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement