
పిల్లల భద్రతపై ఉపాధ్యాయులకు శిక్షణ
జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు
నాగారం : ప్రస్తుతం సమాజంలో పిల్లలకు ఇంటా, బయట రక్షణ కొరవడింది. ఈవ్ టీజింగ్, ఇతర వేధింపులు, గృహ హింసకు గురవుతున్నారు. దీంతో పిల్లల భద్రతకు ప్రాధాన్యమిస్తూ వారికి పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడిని ఎంపిక చేసి పి ల్లల భద్రత, మానవ అక్రమ రవాణా, ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. జిల్లాస్థాయిలో మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని 181 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుంచి ఒక్కో ఉపాధ్యాయుడిని ఈ శిక్షణకు ఎంపిక చేశారు.
శిక్షణ వివరాలు..
జిల్లాలోని 181 ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాల్లో మొదటి విడత శిక్షణ అక్టోబర్ 6, 7 తేదీల్లో, రెండో విడత అక్టోబర్ 8, 9 తేదీల్లో, మూడో విడత అక్టోబర్ 14, 15 తేదీల్లో నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు.
ఉపాధ్యాయుల ద్వారా పిల్లలకు అవగాహన
పిల్లల భద్రతపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించి వారి ద్వారా పిల్లలకు అవగాహన కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. పిల్లల శారీరక, మానసిక స్థితి, ఆర్థిక భద్రతపై దృష్టి సారిస్తున్నారు. కుటుంబంలో, బయట భద్రత పొందేలా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. గృహ హింస, కుటుంబ సభ్యుల నుంచి వేధింపులను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో సూచిస్తారు. ఇందులో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయనున్నారు.
ఫ ప్రతి ఉన్నత పాఠశాల
నుంచి ఒకరి ఎంపిక
ఫ మూడు విడతల్లో
నిర్వహించేందుకు కార్యాచరణ
ఫ స్వచ్ఛంద సంస్థల సహకారం
తీసుకోనున్న ప్రభుత్వం
పిల్లల భద్రత అంశంపై ఉపాధ్యాయులకు జిల్లాలో మూడు విడతలో్‌ల్ శిక్షణ ఇప్పించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ శిక్షణ అక్టోబర్ 6 నుంచి 15 వరకు కొనసాగుతుంది. సమాజంలో పిల్లలు భద్రత పొందేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు.
–అశోక్, డీఈఓ, సూర్యాపేట

పిల్లల భద్రతపై ఉపాధ్యాయులకు శిక్షణ