శ్రీకాకుళం కల్చరల్: ఒకే పండగ.. వేర్వేరు సంప్రదాయాలు.. వేర్వేరు పద్ధతులు. జిల్లా కేంద్రంలో చాలా మంది ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి చెందిన వారు. ఉత్కృష్టమైన సంప్రదాయాలు కలిగిన ఉన్న వారు. రాజస్థాన్, మహారాష్ట్రలలో దసరాల సమయంలో వారి సంప్రదాయ నృత్యమైన ‘దాండి యా’ నృత్యాన్ని ప్రతిరోజు నిర్వహిస్తారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రావణ, కుంభకర్ణ, మేఘనాథుని బొమ్మలు తయారు చేసి వాటిని కాల్చుతారు. రామాయణం, రామ్‌లీలపై నృత్యాలు చేస్తారు.
బొమ్మల కొలువులు ఎక్కువ
తమిళనాడులో దీపావళి, పొంగల్ బాగా జరుపుతా ము. దసరాలో సరస్వతీ పూజలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దుర్గా, లక్ష్మీ సరస్వతులను కొలుస్తాము. ముఖ్యంగా బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తాము. ప్రతి ఇంట్లో ఈ బొమ్మల కొలువులు ఉంటాయి.
– సుబ్రహ్మణ్య కదిరేసన్, తమిళనాడు


