జాతీయ స్థాయి గట్కా పోటీలకు జూనియర్‌ కళాశాల విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి గట్కా పోటీలకు జూనియర్‌ కళాశాల విద్యార్థి

Oct 20 2026 4:49 AM | Updated on Oct 20 2026 4:49 AM

నరసన్నపేట: స్కూల్‌ గేమ్స్‌లో భాగంగా జాతీయ స్థాయిలో అక్టోబరు 23 నుంచి ఢిల్లీలో జరిగే గట్కా పోటీలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఒకేషనల్‌ విద్యార్థి శేఖర్‌ ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ వపన్‌ మరమట్ల తెలిపారు. ఈ మేరకు స్కూల్‌ ఫెడరేషన్‌ కమిటీ సమాచారం ఇచ్చిందన్నారు. రాష్ట్ర స్థాయిలో అక్టోబరు 9,10 వ తేదీల్లో జరిగిన పోటీల్లో శేఖర్‌ బంగారు పథకం పొందినట్లు తెలిపారు. జాతీయ స్థాయి గట్కా పోటీల్లో ప్రతిభ చూపి జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేయాలని ప్రిన్సిపల్‌ కోరారు. ఈ మేరకు శేఖర్‌ ఢిల్లీ పయనం అవుతున్నట్లు తెలిపారు. కాగా శేఖర్‌ను కళాశాల అధ్యాపకులు అభినందించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా

ఎన్నికలకు రావాలి

● ఎమ్మెల్సీ నర్తు రామారావు

ఇచ్ఛాపురం రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు రావాలే తప్ప అభ్యర్థులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తూ భయబ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండున్నరేళ్ల పాలనలో ఎ లాంటి అభివృద్ధి చేయలేదని, ఎన్నికల హామీ ల అమలులో ఘోరంగా విఫలమైందని అన్నా రు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు, ఎన్నికల అధికారు లు తమ బాధ్యలను విస్మరించి కూటమి నేతలకు మద్దతు పలకడం దురదృష్టకరమని అన్నారు. కడప, పుంగనూరు, రాయచోటి, పులివెందుల, తిరుపతి, గుత్తి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో దాడులతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్‌ వేయకుండా చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష అభ్యర్థులకు రక్షణ క ల్పించాల్సిన పోలీసులే అధికార పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని దిగజారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి నేతలు చేస్తున్న దాడులే రాబోవు ఎన్నికల్లో వారి ఓటమికి పునాదులని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement