మీ త్యాగం చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

మీ త్యాగం చిరస్మరణీయం

Oct 20 2026 4:49 AM | Updated on Oct 20 2026 4:49 AM

● 21న పోలీసు అమరవీరులు సంస్మరణ దినోత్సవం

● నేటి నుంచి స్మారకోత్సవాలు

శ్రీకాకుళం క్రైమ్‌ : సభలు, సమావేశాలు, ఉత్సవాలు, పండగలు.. కార్యం ఏదైనా ఖాకీల రాక తప్పనిసరి. ప్రపంచమంతా సంబరాల్లో మునిగి తేలుతున్నా పోలీసులు మాత్రం కుటుంబానికి దూరంగా విధి నిర్వహణలో ఉంటారు. రాజకీయ క్రీడలో నలిగిపోతూ.. నిత్యం ఒత్తిళ్ల మధ్య రోజులు గడుపుతూ సమాజాన్ని తండ్రిలా కాపు కాస్తున్నారు. జిల్లాలో విధి నిర్వహణలో పోలీసులు కన్నుమూశారు. వారిని స్మరిస్తూ ఈ నెల 21 నుంచి 31 వరకు స్మారకోత్సవాలను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. మన అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటే..

కొండ దగ్గర కాపుకాసి..

విజయనగరం జిల్లా డెంకాడ మండలం గునపురం పేట గ్రామానికి చెందిన ఎస్‌.బంగారునాయుడు 1992 మార్చి 24న కాశీబుగ్గలో విధులు నిర్వహిస్తుండగా.. మందస మండలం భేతాళపురంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో స్పెషల్‌ బ్రాంచి ఎస్‌ఐ జగన్మోహనరావు, ఏడు మంది ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ సిబ్బందితో కలిసి రైడ్‌కు వెళ్లారు. ఇద్దరు నిందితులను పట్టుకుని వస్తున్న సమయంలో రట్టి కొండ దగ్గర కొండ ముసుగున ఉన్న నాగవళి దళం కాల్పులు జరపగా వీర మరణం పొందారు.

సమాచార సేకరణలో దిట్ట..

జిల్లాలోని టెక్కలి గ్రామానికి చెందిన ఎం.నరేంద్రదాస్‌కు నక్సలైట్ల సమాచార సేకరణలో దిట్టగా పేరుంది. నక్సలైట్ల కదలికలను గమనించి వారిని నిరోధించడంతో నక్సల్స్‌ సహించలేకపోయారు. 1997 మార్చి 17న కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే సమయంలో దారిలో దైవ దర్శనానికి ఆగి ఉన్న సమయం చూసి నక్సలైట్లు పిస్టోల్‌తో కాల్పులు జరపగా దాస్‌ వీరమరణం పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement