ఇదెక్కడి న్యాయం..? | - | Sakshi
Sakshi News home page

ఇదెక్కడి న్యాయం..?

Oct 20 2026 4:49 AM | Updated on Oct 20 2026 4:49 AM

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): ఎన్నికల నిబంధనల్లో భాగంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయమనడం సర్వసాధారణం. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక ఆదేశాలిచ్చి భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాలకు ముసుగులు వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య, దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్‌ డి.గణేష్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంత వరకు దేశ చరిత్రలో ఏ కలెక్టర్‌ ఇలా చేయలేదన్నారు. దీన్ని రాజ్యాంగ వ్యతిరేక చర్యగా భావిస్తున్నామన్నారు. అంబేడ్కర్‌ విగ్రహాలకు ముసుగులు వేయాలని తహసీల్దార్లకు ఆదేశా లు ఇవ్వడం విరుద్ధమన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే అంబేడ్కర్‌ వాదులంతా తీవ్రంగా ప్రతిఘటించాల్సి వస్తుందన్నారు.

ఉత్సాహంగా దాండియా నృత్యాలు

శ్రీకాకుళం కల్చరల్‌: జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న రాజస్థానీయులు దసరా ఉత్సవాలను వారి పద్ధతుల్లో వైభవంగా నిర్వహిస్తున్నారు. స్థానిక టౌన్‌హాలు వేదికగా ఏర్పాటు చేసుకొని ఆమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని పూజలతో పాటుగా దాండియా నృత్యాన్ని ప్రతి రోజు ప్రదర్శిస్తున్నారు. 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement