వైఎస్సార్‌సీపీలో 200 కుటుంబాల చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో 200 కుటుంబాల చేరిక

Oct 20 2026 4:49 AM | Updated on Oct 20 2026 4:49 AM

రణస్థలం: కూటమి పార్టీ పరిపాలనలో ప్రజలు నిత్యం కష్టాలతో సతమతం అవుతున్నారని, అందుకే వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారని మాజీ ఎమ్మె ల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని వైఎస్సార్‌ సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ కార్యాలయంలో జి.సిగడాం మండలంలోని దేవరవలస గ్రామానికి చెందిన 200 జనసేన కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. జనసేన పార్టీలో ప్రధాన నా యకుడు తిరుమరెడ్డి ఉదయ్‌తో పాటు ఆ గ్రామానికి చెందిన పలువులు నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే కిరణ్‌ కుమార్‌ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పని చేయాలని సూచించారు. అందరం కలిసి పని చేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్పారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు డోల వెంకటరమణ, మాజీ ఎంపీపీ మీసాల వెంకటరమణ, మాజీ జెడ్పీటీసీ కాయల రమణ, మాజీ ఎంపీటీసీ తిరుమరెడ్డి లక్ష్మణ, నాయకులు బాలి అప్పలసూరి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement