వజ్రపుకొత్తూరు రూరల్: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల సూదికొండకు చెందిన ముద్దాయి దూలి రాజేశ్వరికి సారా విక్రయించిన కేసులో ఏడాది కాలం జైలు శిక్షతో పా టు రూ. 2లక్షల జరిమానా విధిస్తూ గురువా రం పలాస జూనియర్ సివిల్ కోర్టు న్యాయ మూర్తి యు.మాధురి తీర్పు వెలువరించారు. పలాస ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కె.మల్లికార్జునరావు తెలిపిన వివరాలు మేరకు.. పలాస ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా 2021 మార్చి 4న ముద్దాయి దూలి రాజేశ్వరి సారా విక్రయి స్తూ పట్టుబడటంతో అప్పట్లో విధుల్లో ఉన్న ఎకై ్సజ్ ఎస్‌ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసు లో ముద్దాయి రాజేశ్వరిని ఈ ఏడాది మార్చి 23న కోర్టులో హాజరుపర్చాల్చి ఉండగా ముద్దా యి అందుబాటులో లేకపోవడంతో తీర్పు రిజ ర్వ్ చేశారు. అయితే ముద్దాయి రాజేశ్వరిని గురువారం పలాస జూనియర్ సివిల్ కోర్టులో హాజరు పరిచామని అన్నారు. ఈ మేరకు కోర్టు తుది తీర్పు వెల్లడించినట్లు ఆయన తెలిపారు.
రణస్థలం: కోష్ట జాతీయ రహదారిలోని పై వంతెనపై ఈ నెల 22న ముందు వెళ్తున్న లారీని ఢీకొని గాయపడిన డ్రైవర్ పొట్నూరు ఎర్రిబా బు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జేఆర్ పురం ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నం జిల్లాలోని భీమిలి మండలానికి చెందిన ఎర్రిబాబు క్యాబిన్‌లో ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
వజ్రపుకొత్తూరు రూరల్: బెండి గేటు సమీపంలోని కాశీబుగ్గ పాత జాతీయ రోడ్డులో గరుడఖండి దగ్గర గురువారం గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అరుదైన నక్క మృతి చెందింది. ప్రధానంగా ఈ నక్కలు కొండ ప్రాంత పరిసర తోటలో సంచరిస్తుంటాయి. రాత్రి సమయంలో ఆహారం కోసం బెండి కొండ నుంచి వస్తూ ప్రమాదానికి గురై ఉండవచ్చని స్థానికులు తెలిపారు.
రణస్థలం: లావేరు మండలంలోని లావేటిపా లెం గ్రామానికి చెందిన ఓయిబోయిన గంగు లు, అప్పలసూరిలకు చెందిన సుమారు 20 గొర్రె పిల్లలను కుక్కలు చంపేశాయి. బుధవా రం అర్ధరాత్రి సమయంలో కుక్కలు ఈ దారుణానికి ఒడికట్టాయి. ఇంతలా నష్టం వాటిల్లడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. సుమారు రూ. 2లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవా లని వేడుకుంటున్నారు. లావేరు పశువైద్యులు గాయిత్రిదేవి, వీఆర్‌ఓలు వేణుగోపాల్ పరిశీలించి శవపంచనామా చేశారు. లావేరు వైఎస్సార్‌సీపీ గ్రామనాయకులు లంకలపల్లి మహే ష్ సంఘటన స్థలానికి వెళ్లి జరిగిన నష్టాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.


