శ్రీకాకుళం పాతబస్టాండ్ : నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళంలో బార్ అసోసియేషన్ సభ్యులు గురువారం ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కోర్టు సమీపం నుంచి అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మాట్లాడుతూ నీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు పైడి విశ్వేశ్వరరావు, మామిడి క్రాంతి, ఆల్ ఇండియా లాయర్స్ సీనియర్ జిల్లా అధ్యక్షులు దుంపల రమణరావు, డి.ఈశ్వరరావు, కొమ్ము రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


