ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం | - | Sakshi
Sakshi News home page

ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

Jul 24 2026 1:39 AM | Updated on Jul 24 2026 1:39 AM

గార: ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. గురువారం అంపోలు జిల్లా జైలును సందర్శించి ఖైదీలకు అందుతున్న ఆహారం, వసతులు, పారిశుద్ధ్యం పరిశీలించారు. విచారణ, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లాయరు లేని ఖైదీలకు లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ ద్వారా నియమించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మహిళా ఖైదీలకు ప్రత్యేకంగా చట్టపరమైన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ జి.మధుబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement