పద్మ పురస్కారాలకు నామినేషన్ల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

పద్మ పురస్కారాలకు నామినేషన్ల ఆహ్వానం

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

త్వరలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకులకు 2027 సంవత్సరపు ’పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, వ్యాపార పారిశ్రామిక, ప్రజా వ్యవహారాలు విభాగాల్లో విశిష్టమైన గుర్తింపు పొందిన వారి ని పద్మ విభూషణ్‌, పద్మ భూషణ్‌, పద్మశ్రీ అవార్డుల కోసం ప్రతిపాదించవచ్చని పేర్కొ న్నారు. ముఖ్యంగా గుర్తింపునకు నోచుకోని క్షేత్రస్థాయి వ్యక్తులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల నుంచి అర్హులను గుర్తించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. స్వీయ నామినేషన్లు ఆన్‌లైన్‌ ద్వారా http:awards.gov.in పోర్టల్‌లో సమర్పించవచ్చని, ఆన్‌లైన్‌ దరఖాస్తులకు జూలై 31, 2026 చివరి తేదీ అని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని అర్హులైన వ్యక్తుల వివరాలను నిర్ణీత నమూనాలో జూన్‌ 10వ తేదీలోగా కలెక్టర్‌ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు. అర్హులైన వారు నామినేషన్‌ సమర్పించేటప్పుడు ఆ వ్యక్తి సాధించిన విజయాలను, చేసిన విశిష్ట సేవలను స్పష్టంగా వివరించేలా ఒక వివరణాత్మక పత్రాన్ని జత చేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం www. padmaawards.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

మంత్ర పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు

పాతపట్నం: పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారికి సహస్ర నామార్చనలు, నీరాజన మంత్ర పుష్పాలతో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. 51వ వార్షిక మహత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖడ్గ నామాల తో కుంకుమార్చనలు, మూల మంత్ర హోమా లు నిర్వహించామని ఈఓ వి.వాసుదేవరావు తెలిపారు. సోమవారం తెల్లవారు జాము నుంచి అధిక సంఖ్యలో భక్తులకు అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. ఆంధ్ర, ఒడిశా నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఖైదీల కుటుంబాలకు ‘స్పృహ’తో సామాజిక భరోసా

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: నేర బాధితులు, జైలులో ఉన్న వ్యక్తులపై ఆధారపడిన కుటుంబాలకు సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలవడమే ‘నల్సా స్పృహ–2025’ పథకం ప్రధాన లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు పేర్కొన్నారు. సోమవారం స్థానిక న్యాయ సేవా సదన్‌లో ప్యానల్‌ న్యాయవాదులు, పారా లీగల్‌ వాలంటీర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ.. సమాజంలో అపవాదు ఎదుర్కొంటున్న ప్రభావిత వర్గాలకు ఈ పథకం ద్వారా బహు ముఖ మద్దతు లభిస్తుందని వివరించారు. ఖైదీల కుటుంబాల్లోని పిల్లల విద్య, కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి దెబ్బతినకుండా ప్యానల్‌ న్యాయవాదులు, వలంటీర్లు వారధిలా పనిచేయాలని ఆయన సూచించారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: యోగాసనా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు త్వరలో నరసన్నపేటలో నిర్వహించనున్నట్లు నేషనల్‌ యోగా స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌ పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యోగా పోటీలపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. 10–55 ఏళ్ల వయసు వరకు 12 కేటగిరీల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. వివరాలకు 9676472733, 9492266889 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement