తలశిలకు జిల్లా నాయకుల పరామర్శ
నరసన్నపేట : ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ నాయకుడు తలశిల రఘురాం కుటుంబాన్ని విజయవాడలోని ఆయన నివాసంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు సోమవారం కలిసి పరామర్శించారు. రఘురాం తండ్రి చంద్రశేఖరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో కృష్ణదాస్, ఎచ్చెర్ల, ఆమదాలవలస, టెక్కలి నియోజకవర్గాల సమన్వయకర్తలు గొర్లె కిరణ్‌కుమార్, చింతాడ రవికుమార్, పేరాడ తిలక్ పరామర్శించారు. వీరి వెంట రణస్థలం మండల పార్టీ అధ్యక్షుడు గొర్లె శ్రీనివాసరావు ఉన్నారు.


