శ్రీకాకుళం
న్యూస్‌రీల్
కేజీబీవీ విద్యార్థినికి అస్వస్థత
ఏం నేరం చేశామని ఈ శిక్ష..?
● పాతికేళ్లుగా తాగునీటికి
తంటాలు పడుతున్నాం
● మండల పరిషత్ ఎదుట బైఠాయించిన కొత్తపాలెం మహిళలు
● ఊరికి కుళాయిలు వేయాలని వేడుకోలు
బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026
‘పాతికేళ్లుగా మా గ్రామానికి తాగునీరు కల గా మిగిలిపోయింది. ఉద్దానం ప్రజల దాహార్తిని తీర్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.700 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసి ఇంటింటికీ మంచినీటి కుళాయిలు వేశారు. మా ఊరికీ ఆ నీళ్లు ఇప్పించాలి. ఏం నేరం చేశామని మా గ్రామంపై ఈ చిన్నచూపు’ అంటూ కవిటి మండలం కొత్తపాలెం మహి ళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 700 జనాభా గల ఊరిలో కేజీబీవీ కూడా ఉంది. అయినా మంచినీరు ఇచ్చే ఆలోచన ఏ నాయకుడూ చేయలేదు. దీంతో స్థానిక మహిళలు మంగళవారం కవిటి మండల పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఓట్లు వేసినప్పుడు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పిన నేతలు గెలిచాక తమకు కనీసం తాగునీరు అందించడం లేదని అన్నారు. మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యే అశోక్‌కు కూడా ఆయన సొంత పంచాయతీలో ఉన్న తమ తాగునీటి కష్టాలు కనిపించడం లేదా? 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో మా అంతటి దుస్థితి ఎవ్వరికీ ఉండదేమో అని మండల పరిషత్ కార్యాలయం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. నెలకు మూడు నాలుగు సార్లు తమ ఊరిలో 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపడి ప్రాణసంకటంగా మారుతున్నాయని, అయినా పట్టించుకోవడం లేదని అన్నారు. సమస్యలపై సత్వర చర్యలు తీసుకోకుంటే వెయ్యి మందితో రోడ్డెక్కి నిరసన తెలుపుతామని అన్నారు. ప్రస్తుతం ఊరికి ఓ ట్యాంకు వస్తున్నా అందులో వచ్చిన నీరు ఒక వ్యక్తి సగానికి పైగా వాడుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. స్నానాలకు కూడా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. –కవిటి
వెయ్యిమందితో నిరసన చేస్తాం
దాదాపు పాతికేళ్లుగా తాగునీటి కోసం కటకటలాడుతున్నాం. పలుమార్లు పత్రికల్లో కథనాలుగా సమాచారం ఇచ్చాం. ప్రత్యక్షంగా చెప్పాం. ఏం చేసి నా ఇప్పటివరకు సరైన చర్యలు లేవు. ఇప్పటికై నా మా సమస్యను ప్రాధాన్యతగా పరిగణించి పరిష్కరించకుంటే వెయ్యిమందితో కవిటి బస్టాండ్‌లో నిరసన చేపడతాం. – సూర్ని లచ్చయ్య, కొత్తపాలెం
పొందూరు: లోలుగు గ్రామంలో కేజీబీవీ పాఠశాలలోని ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థిని పి.హారిక మంగళవారం అస్వస్థతకు గురైంది. పాఠశాలలో సోమవారం రిపబ్లిక్‌డే నిర్వహించారు. రాత్రి భోజనాలు తర్వాత అంతా నిద్రపోయారు. మంగళవారం ఉదయం అందరూ నిద్ర లేచినా ఆమె మేలుకోలేదు. తోటి విద్యార్థులు ఎంత ప్రయత్నించినా లేవకపోవడంతో కేజీబీవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్పటికీ వి ద్యార్థిని లేవలేకపోయింది. దీంతో మండలంలోని వావిలపల్లిపేటలో ఉంటున్న హారిక కు టుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకుని హారికను శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్చారు. విద్యార్థినికి మంగళవారం రాత్రి వరకు స్పృహ రాలేదు.
శ్రీకాకుళం
శ్రీకాకుళం


