ప్రజలకు క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు క్షమాపణ చెప్పాలి

Jan 28 2026 8:35 AM | Updated on Jan 28 2026 8:35 AM

ప్రజలకు క్షమాపణ చెప్పాలి

ప్రజలకు క్షమాపణ చెప్పాలి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అరసవల్లి రథ సప్తమి వేడుకల్లో భక్తులకు చేదు అనుభవం ఎదురైందని, దీనిపై అధికార పక్ష నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్‌ డిమాండ్‌ చే శారు. ఎన్నో ఏళ్లుగా ఆధ్యాత్మికంగా జరుగుతున్న పండుగను రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం సర్వ నాశనం చేసిందని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. స్వరూప్‌ మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలకు రోజుకో అధికారికి బాధ్యతను అప్పగించి అసలైన రథ సప్తమికి ఎవరూ బాధ్యత తీసుకోలేదని విమర్శించారు. అరగంటలో దర్శమని కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యే, అధికారులు ప్రచారం చేసి ఆరుగంటలైనా దర్శనాలు చేయించలేకపోయారని దు మ్మెత్తిపోశారు. దాతలతోనే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయని, అలాంటిది వారికి కనీస గౌ రవం ఇవ్వకుండా కిలోమీటర్ల మేర నడిపించి దర్శనాలు చేయించారన్నా రు. ఫండ్‌ కలెక్షన్‌ కమిటీ అంటూ వ్యాపారులతో ఆయా శాఖల అధికారులకు లింక్‌ పెట్టి డబ్బులు వసూలు చేయడం సరికాదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు దర్శనానికి వస్తే ఆ సమయంలో ప్రొటోకాల్‌ అధికారులంతా అటు ఉండిపోయి సాధారణ భక్తులకు ఆటంకం కలిగించారన్నారు.

వైఎస్సార్‌ సీపీ ఎస్‌ఈసీ మెంబర్‌ చల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ దర్శనాల బాధ్యతను గాలికొదిలేసి సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి సారించడం సరికాదన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవీ కనిపించలేదన్నారు. ప్రజల బాధలు పట్టించుకోకుండా నాయకులు ప్రచార ఆర్భాటానికే ప్రా ధాన్యత ఇవ్వడం దారుణమన్నారు. వారి నిర్లక్ష్య మే భక్తుల పాలిట శాపమైందన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి మాట్లాడుతూ అధికార పక్ష నాయకులకు ప్రచారంపై ఉన్న శ్రద్ధ భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించడంలో లేదన్నారు. సింహాచలం, పలాసలో విషాద సంఘటనలు జరిగి నా పట్టించుకోకుండా రథ సప్తమి వేళ కూడా అదే నిర్లక్ష్యం ప్రదర్శించారని అన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌, జిల్లా పరిషత్‌ సీఈఓ వంటివారికే దర్శనాలకు పంపించలేదంటే సామాన్యుల పరిస్థితి ఇంకెంత దారుణమో అర్థం చేసుకోవచ్చన్నారు.

వైఎస్సార్‌సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కోణార్క్‌ శ్రీను మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ లేని విధంగా వ్యాపారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ఉత్సవాలు చేశారని తెలిపారు. వ్యాపారులకు కమర్షియల్‌ టాక్స్‌, తూనికలు కొలతలు, కార్మికశాఖ, మున్సిపల్‌ వంటి డిపార్ట్‌మెంట్ల అధికారులతో లింక్‌ చేసి భయపెట్టి డబ్బులు దోచుకోవడం సరికాదన్నారు. వృద్ధులకు ప్రత్యేక లైన్లు లేవు, దాహం వేస్తే మంచినీళ్లు అందించే దాతలు లేరు, ఎటువైపు వెళితే దర్శనాలు అవుతాయో తెలియని పరిస్థితిలో వేడుకలు నిర్వహించారన్నారు.

అనంతరం వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు మాట్లాడుతూ నేరుగా ఎమ్మెల్యే, కా ర్యకర్తల్ని బుల్లెట్‌ బండిపై ఎక్కించుకుని రోడ్‌షో చేయడం వల్ల భక్తులకు ఒరిగిందేమీ లేదన్నారు. పార్టీ మైలేజ్‌ పెంచుకోవాలన్న ఆలోచన తప్ప భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోయారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మండవల్లి రవి, ద్వారపు అజిత్‌, లుకలాపు గోవిందరావు, జలగడుగుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అరగంటలో దర్శనమన్నారు,

ఆరు గంటలైనా దర్శనాలు లేవు

ప్రచారం మీద ఉన్న శ్రద్ధ సదుపాయాలు కల్పించడంలో లేదు

రథసప్తమి పేరుతో వసూళ్లకు తెర లేపారు

మీడియా సమావేశంలో దుమ్మెత్తిపోసిన వైఎస్సార్‌సీపీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement