సచివాలయాలపై అక్కసు
అరసవల్లి: అధికార పక్ష నాయకులు సచివాలయ వ్యవస్థపై నిలువెల్లా పెంచుకున్న కక్ష సందర్భానుసారం బయటపడుతూనే ఉంది. తాజాగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సచివాలయా లపై తన అక్కసు వెళ్లగక్కారు. పరస్పర వాగ్వాదాల నడుమ మంగళవారం జరిగిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు రసాభాసగా మారాయి.
అధికారులూ...జాగ్రత్త
జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన 1వ, 2వ, 4వ, 7వ స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతున్న క్రమంలో పింఛన్లు, ఇళ్ల నిర్మాణాలపై చర్చ మొదలైంది. ఈ సందర్భంగా 2019–24 మధ్య ఇళ్ల నిర్మాణాల వివరాలు ఇవ్వాలని కూన కోరారు. అధికారులు సమాధానం ఇవ్వగా ఆ వివరాలు సరికాదని కూన అన్నారు. లెక్కలు సరిగ్గా చూసుకోవాలని అధికారులకు తెలియజేశారు. అంతకుముందు కూడా జిల్లా పరిషత్ సీఈ ఓ సత్యనారాయణతో పాటు అకౌంట్స్ విభాగ ఏఓ పక్కి రేణుకపై కూడా కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో చాలా మంది అధికారులు జెడ్పీ సమావేశాలకు సమగ్ర సమాచారాలతో హాజరుకావడం లేదని, అసలు మీ ఉద్యోగులకు నెలకు జీతం పడితే చాలు, డీఏ పెరిగితే చాలని, విధులు మా త్రం సక్రమంగా నిర్వహించడం లేదన్నారు.
‘సచివాలయాలు దరిద్రాలయాలు’
సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే రవి మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పింఛన్ల మంజూరులో ఎన్నో అవకతవకలకు పాల్పడిందని, అర్హులు కానివారికి దివ్యాంగులుగా పింఛన్లు ఇచ్చేశారని వ్యాఖ్యానించారు. దీనిపై జెడ్పీ వైస్ చైర్మన్ జగన్మోహనరావు, జెడ్పీటిసీలు టొంపల సీతారాం, వంగర ఎంపీపీ ముఖర్జీ, కంచిలి ఎంపీపీ దేవదాస్‌రెడ్డి తదితరులు స్పందిస్తూ ఘాటుగా సమా ధానం ఇచ్చారు. దీంతో రవికుమార్ ఆగ్రహంతో వెంటనే నాటి, నేటి పింఛన్ల వివరాలను సభ లో ప్రకటించాలంటూ డీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పిరియా విజయ జోక్యం చేసుకుంటూ వైఎస్ జగన్ ఇచ్చిన లక్షలాది పింఛన్ల వివరాలను వివరించారు. ప్రతి సచివాలయం వద్ద ఆయా పరి ధిలో వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలతో పాటు పింఛన్ దారుల వివరాలు అన్నీ బోర్డులో ప్రదర్శించేవారని, ఇప్పుడెందుకు ప్రదర్శించడం లేదంటూ ప్రశ్నించారు.
దీంతో రవికుమార్ స్పందిస్తూ సచివాలయా లు దరిద్రాలయాలంటూ వ్యాఖ్యానించారు. సచివాలయాల్లో ఉద్యోగులెవ్వరికీ పనులు లేవని, అసలు సచివాలయ వ్యవస్థే దండగ అంటూ వ్యా ఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా జెడ్పీ టీసీలు, ఎంపీపీలు రవికుమార్‌ను చుట్టుముట్టి వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలని, లేదంటే సమావేశాల నుంచి వాకౌట్ చేస్తామంటూ డిమాండ్ చేశారు. వంగర ఎంపీపీ ముఖర్జీ, కంచిలి ఎంపీపీ దేవదాస్‌రెడ్డి త దితరులు మాట్లాడుతూ ‘అధికారంలో మీరే ఉన్నారు కదా. దమ్ముంటే సచివాలయాలను, వ్యవస్థను రద్దు చేయండి చూద్దాం...’ అని సవాల్ విసిరారు. దీంతో సచివాలయాలపై తన వ్యాఖ్యలు సొంత అభిప్రాయమని, ప్రభుత్వం ఇలాగే అనుకుంటే..వాటిని రద్దు చేస్తుందేమో అని రవి ప్రకటించారు.
సచివాలయాలు దరిద్రాలయాలు
అంటూ ఎమ్మెల్యే కూన రవి వ్యాఖ్య
భగ్గుమన్న జెడ్పీ చైర్‌పర్సన్, జెడ్పీటీసీలు
దమ్ముంటే సచివాలయాలను రద్దు చేయగలరా అంటూ సవాల్
వాడీవేడిగా జిల్లా పరిషత్ స్థాయీ
సంఘ సమావేశాలు
సచివాలయాలపై అక్కసు


