వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్తగా శ్యామ్ ప్రసాద్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇచ్ఛాపురం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ సమన్వయ కర్తగా సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా పిరియా సాయిరాజ్ నియమితులయ్యారు. పార్లమెంట్ కో ఆర్డినేటర్‌గా తమ్మినేని సీతారాం కొనసాగుతారని పార్టీ కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
సాడికి గుర్తింపు
సాడి పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి సమన్వయకర్తగా నియమించారు. ఇచ్ఛాపురం మండలం అరకభద్ర గ్రామానికి చెందిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి బీటెక్ చదువుకున్నారు. విద్యాభ్యాసం తర్వాత వైజాగ్, కాకినాడ కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీలో ఏజీఎంగాను, సౌదీలో సీనియర్ ఇంజినీర్‌గా పని చేశారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి తల్లి కాంచనా దేవి అరకభద్ర వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు.
శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య కళావతి తాత దక్కత పితంబర్ రెడ్డి ఇచ్ఛాపురం సమితి ఏర్పడిన తర్వాత మొదటి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి 2014లో ఇచ్ఛాపురం నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ మొదటి సమన్వయకర్తగా కొన్ని నెలల పాటు సేవలందించారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు సీడాప్ చైర్మన్‌గా, పార్టీ జిల్లా సోషల్ మీడియా టాస్క్‌ఫోర్స్ సభ్యునిగా, విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ పరిశీలకుడిగా పని చేశారు. ప్రస్తుతం టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల పరిశీలకుడిగా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)గా చేస్తున్నారు.
సీఈసీ సభ్యునిగా పిరియా సాయిరాజ్
మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమితులయ్యారు. పార్టీకి సుదీర్ఘ కాలంగా అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని సాయిరాజ్‌ను సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా నియమించారు.
పార్లమెంట్ కో ఆర్డినేటర్‌గా తమ్మినేని సీతారాం
శ్రీకాకుళం పార్లమెంట్ కో ఆర్డినేటర్‌గా తమ్మినేని సీతారాం కొనసాగుతారని పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. సీనియర్ నాయకుడిగా, పార్టీకి అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ సమన్వయకర్తగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
పార్టీ సీఈసీ సభ్యుడిగా పిరియా సాయిరాజ్
పార్లమెంట్ కో ఆర్డినేటర్‌గా
తమ్మినేని సీతారాం
మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం
తమ్మినేని సీతారాం
శ్యామ్ ప్రసాద్ రెడ్డి
వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్తగా శ్యామ్ ప్రసాద్
వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్తగా శ్యామ్ ప్రసాద్


