రహదారి భద్రతపై డ్రైవర్లకు అవగాహన
శ్రీకాకుళం రూరల్: రహదారి భద్రతకు సంబంధించి మునసబుపేటలోని గురజాడ ఎడ్యుకేషన్ అకాడమీలో మంగళవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో 120 మంది ఆటో, లారీ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని డాక్టర్ సత్యసూర్య, డాక్టర్ శశిధర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీటీసీ విజయసారధి మాట్లాడారు. డ్రైవర్లు రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం డ్రైవర్లకు కంటి పరీక్షలు, షుగర్ బీపీ టెస్టులు నిర్వహించారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు గంగాధర్, అనిల్, వైద్యులు దానేటి హర్ష, బొడ్డేపల్లి అనూష, బ్రాహ్మణి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.


