రెడ్‌బుక్ రాజ్యంలో..
అధికారం చేతిలో ఉంటే.. పాలించే పార్టీ మనదే అయితే ఇక తిరుగేముంటుంది. మనం తప్పు చేసినా ఒప్పే.. చట్టం మనవైపు నిలుస్తుంది. దేశ రక్షకులైనా, ఒక పంచాయతీని పాలించే సర్పంచ్ అయినా అధికార పార్టీ వారు కాకపోతే శత్రువుల్లానే చూస్తుంది. బాధితులనే నిందితులుగా నిలబెడుతుంది.. కుదిరితే దోషు లుగానూ తేల్చేస్తుంది. ఏమిటీ నమ్మడం లేదా.. అయితే హిరమండలం ధనుపురం, కోటబొమ్మాళి, జలుమూరు మండలం రావిపాడు గ్రామాల్లో టీడీపీ దన్నుతో కొందరు పెట్రేగిన తీరు.. వారిపై ఫిర్యాదులందినా చర్యలు తీసుకోకుండా కొమ్ముకాస్తున్న పోలీసులు, ఎమ్మెల్యే, మంత్రుల తీరు చూడండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. ఆటవిక రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానం, ఆందోళన కలగక మానవు.


