● నగదు లేక.. టోల్ కట్టక
శ్రీకాకుళం ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 30 జెడ్ 0129 నంబర్ బస్సు ప్రయాణికులను అవస్థలకు గురి చేసింది. బస్సుకు చెందిన ఫాస్టాగ్‌లో డబ్బులు లేకపోవడంతో మడపాం టోల్‌గేట్ వద్ద బస్సును నిలిపివేశారు. శ్రీకాకుళం నుంచి పలాసకు సోమవారం ఉదయం బస్సు 70 మంది ప్రయాణికులతో బయల్దేరింది. మడపాం టోల్‌గేట్ వద్ద అక్కడ సిబ్బంది తనిఖీ చేయగా ఫాస్టాగ్‌లో డబ్బు లేదని గుర్తించారు. దీంతో బస్సును పంపించేందుకు టోల్ సిబ్బంది నిరాకరించారు. చేసేదేమీ లేక బస్సు డ్రైవర్ పక్కకు తీసి నిలుపుదల చేశారు. ప్రయాణికులు కూడా కిందకు దిగి నిరీక్షించారు. వారంతా వేరొక బస్సులో తమను పంపించాలని గొడవ చేయడంతో బస్సు డ్రైవర్ విషయాన్ని శ్రీకాకుళం డిపో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు స్పందించి పది నిమిషాల తర్వాత ఫాస్టాగ్‌లో జమ చేశారు. దాని తర్వాత బస్సు ముందుకు కదిలింది. దాదాపు అరగంట పాటు ఇబ్బంది తప్పలేదు. –శ్రీకాకుళం


