కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు

Jan 6 2026 7:57 AM | Updated on Jan 6 2026 7:57 AM

కుక్క

కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు

హిరమండలం: మండలంలోని అంబావల్లి గ్రామంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా యి. సోమవారం కుక్కలబారిన పడి ముగ్గురికి గాయాలయ్యాయి. సిమ్మ ఈశ్వరమ్మ, చిన్న మ్మి, లలితలు కుక్కల బారిన పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు హిరమండలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యసేవలందించారు. అయితే గత కొద్దిరోజులుగా కుక్కలు స్వైర విహారం చేస్తుండడంతో గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వాటిని నియంత్రించాలని కోరుతున్నారు.

సిగ్నల్‌ సమస్యతో నిలిచిన రైలు

టెక్కలి రూరల్‌: స్థానిక తెంబూర్‌ రోడ్డులో గల జిల్లా ఆస్పత్రి సమీపంలో సోమవారం ఉదయం రైలు సుమారు 15 నిమిషాలు పాటు నిలిచిపోయింది. గుణుపూర్‌ నుంచి కటక్‌ వైపు వెళ్లే రైలు సోమవారం ఉదయం సుమారు 5:50 నిమిషాలు సమయంలో తెంబూర్‌ రోడ్డు జంక్షన్‌ వద్ద ఉన్న గేటు వేసినప్పటికి సిగ్నల్‌ సమస్య ఏర్పడటంతో నిలిచిపోయింది. దాదా పు 15 నిమిషాల పాటు గేటుకు అటూ ఇటూ వాహనాలు నిలిచిపోయాయి. కొంత సమయం తర్వాత సిగ్నల్‌ సరిచేయడంతో రైలు కదిలింది.

పోస్టుల భర్తీ ఇప్పుడా?

శ్రీకాకుళం: జిల్లాలోని 9 మోడల్‌ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 15 పీజీటీ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు సోమవారం విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం మరో మూడు నెలల్లో ముగుస్తుండగా ఇప్పుడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వడాన్ని ఆక్షేపిస్తున్నారు. సిలబస్‌లు దాదాపు పూర్తయిపోయిన దశలో నోటిఫికేషన్‌ రావడం విడ్డూరంగా ఉందంటున్నారు. లావేరు, పొందూరు, పోలాకి, జలుమూరు, పాతపట్నం, సోంపేట, కంచిలి, కమిటీ, ఇచ్ఛాపురం మండలాలలో ఖాళీగా ఉన్న 15 పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 8వ తేదీలోగా దరఖాస్తులను మోడల్‌ స్కూల్‌లలో అందజేయాలని సూచించారు. ఈ లెక్కన సంక్రాంతి పండుగలోగా భర్తీలు జరిగే అవకాశాలు లేవు. ఫిబ్రవరి నుంచి మీరు పాఠశాలలకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. మార్చి నెలలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరగనుండగా, ఒక్క నెలలో వీరితో ఏ విధంగా బోధన చేయిస్తారో ఏ ఒక్కరికి అర్థం కావడం లేదు. అలాగే ఈ ఉద్యోగంలో చేరిన అభ్యర్థులను ఏప్రిల్‌లో విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత తొలగిస్తారు. బోధన సమయాన్ని లెక్కకట్టి గంటకు రూ.250 చొప్పున చెల్లిస్తారు.

‘కార్గో వద్దంటుంటే

సర్వేలు ఎందుకు..?’

మందస: మందస మండలం ఎం.గంగువాడ బస్‌ షెల్టర్‌లో కార్గో ఎయిర్‌ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొమర వాసు ఆధ్వర్యంలో సోమవారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం మందస తహసీల్దార్‌ కార్యాలయంలో కార్గో ఎయిర్‌ పోర్టు ప్రత్యేక అధికారి, లీగల్‌ అడ్వైజర్‌ ఎం.వెంకటేశ్వరరావు, పలాస ఆర్డీఓ జి.వెంకటేశ్వరరావు చేసిన ప్రకటనను తాము ఖండిస్తున్నామని తెలిపారు. మందస, వజ్రపుకొత్తూరు మండలాల ప్రజలు కార్గోకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పలాస ఆర్డీఓ వచ్చినప్పుడు కూడా ఇదే తీర్మానాన్ని రాసి ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ సర్వేకు సహకరించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. కార్గో ఎయిర్‌ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి చెప్పకుండా సర్వేలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కమిటీ కన్వీనర్‌ బత్తిని లక్ష్మణ్‌, స్థానిక సర్పంచ్‌ పొట్టి ధర్మారావు, మామిడి తులసయ్య, జుత్తు భూపతి, బడిచిత్త కూర్మారావు, పొట్టి ఎర్రయ్య, యోగేశ్వరరావు, దున్న రామారావు, రత్నాల చలపతి, గుంటు రామస్వామి, చిత్త గున్నయ్య, చిరంజీవి, సుంకర దిలీప్‌, సత్యం, కృష్ణారావు, మోహన్‌రావు, హేమరాజు తదితరులు పాల్గొన్నారు.

కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు 1
1/1

కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement