● ఆర్మీ ఉద్యోగి కుటుంబంపై దాడి
● ఇంటికి వెళ్లే దారి అడ్డగింత
● రెచ్చిపోయిన టీడీపీ నాయకులు
హిరమండలం: ఆర్మీ ఉద్యోగి దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ఉండగా, ఇక్కడ ఆయన ఇంటిపై దాడి చేసి, ఇంటికి దారి లేకుండా చేసే పనిలో పడ్డారు టీడీపీ నాయకులు. ఎమ్మెల్యే అండదండలు, పార్టీకి చెందిన ఓ విభాగం అధ్యక్షుడి దన్ను చూసుకుని స్థానిక టీడీపీ నాయకులు ఏకంగా ఆర్మీ ఉద్యోగినే టార్గెట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
హిరమండలం ధనుపురం గ్రామంలో సిరిపురం శ్యామలరావు అనే ఆర్మీ ఉద్యోగి పదేళ్ల కిందట ఇల్లు నిర్మించుకున్నాడు. అక్కడ స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నారు. తాను కొనుకున్న ఇంటి ముందు కొంత ఖాళీ స్థలం ఉంది. అయితే ఆ స్థలం గుండా ఇంటిలోకి రాకపోకలు ఉండేవి. అయితే ఇంటి ముందు ఉన్న స్థలంలో ఇంటి గేటు తీయకుండా అడ్డంగా రాళ్లు, కర్రలు వేశారు. దీంతో గోడ దూకి ఇంటికి రాకపోకలు జరుపుతున్నారు. అదే గ్రామానికి చెందిన దారపు షణ్ముఖరావు, అంగూరు భాస్కరావులు తమ స్థలం అని చెబుతూ ఆ స్థలంలో కంచెలు కూడా వేశారు. అప్పటి నుంచి వారి మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆ వివాద స్థలంలో నిర్మాణ పనులు చేపట్టారు. దీన్ని శ్యామలరావు తండ్రి, భార్య అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై దాడి చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫోన్ చేయడంతో హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఉభయ వర్గాలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు.
ప్రస్తుతం బాధితుడు అరుణాచల్ ప్రదేశ్‌లో విధుల్లో ఉన్నాడు. అక్కడ నుంచి నేరుగా విలేకరులతో ఫోన్‌లో మాట్లాడాడు. బాధితుడు శ్యామలరావు ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా పెద్దగా స్పందించలేదు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో జిల్లా మంత్రి అచ్చెన్నాయుడును కలిసి విన్నవించారు. చివరకు మంత్రి నారా లోకే ష్‌కు సైతం ఫిర్యాదు చేశారు. అయినా బాధితులకు న్యాయం జరగడం లేదు. అధికారులపై ఓ ఎమ్మెల్యే ఒత్తిడి ఉందని బాధితులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే దీనిపై ఇంతవరకూ పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది.
● ఆర్మీ ఉద్యోగి కుటుంబంపై దాడి
● ఆర్మీ ఉద్యోగి కుటుంబంపై దాడి


