● ఆర్పీఎఫ్ ఉద్యోగిపై సర్పంచ్ భర్త ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్ : విశాఖపట్నం మర్రిపాలెం సెక్టార్‌లో ఆర్పీఎఫ్ ఉద్యోగిగా పనిచేస్తున్న గొల్లంగి సత్యనారాయణపై జలుమూరు మండలం రావిపాడు పంచాయతీ (యేనేటికొత్తూరు గ్రామం) సర్పంచ్ బోర భారతి భర్త బోర సింహాచలం, గ్రామస్తులు సోమవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. సత్యనారాయణది తమ గ్రామమేనని, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ కార్యక్రమాలు, తగువులు చేస్తూ గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని, యువతకు మ ద్యం ఇచ్చి రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు పెట్టుకుని అల్లర్లు సృష్టిస్తున్నాడని, తనని, తన భార్యని దుర్భాషలాడుతూ మానసికంగా హింసిస్తున్నాడని సింహాచలం ఫిర్యాదు చేశారు. గతంలో గోవాలో పనిచేసిన సత్యనారాయణ అక్కడి మద్యం తెచ్చి వారి తండ్రితో గ్రామంలో అమ్మించగా ఎకై ్సజ్ విభాగం వారు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారన్నారు. ఈ విషయమై ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.


