
బోర్డు నుంచి రోడ్డు వరకు..!
ఉపాధ్యాయుడు అంటే తరగతి గదిలో చదువు చెప్పడమే కాకుండా విద్యార్థులు బడికి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లే వరకు బాధ్యత వహిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇచ్ఛాపురం మండలం ఈదుపురం కండ్రావార్డు ఒడియా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాస్ రంజన్ పట్నాయక్. ఈ పాఠశాలలో 130 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల రోడ్డు పక్కనే ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో విద్యార్థుల హాజరు శాతం తగ్గిపోతుండేది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎం ఉదయం 8 గంటలకు, సాయంత్రం బడి విడిచిపెట్టే సమయంలో ఎర్రజెండాను పట్టుకొని వాహనాలకు రెడ్ సిగ్నల్ ఇస్తూ విద్యార్థులకు రక్షణగా నిలుస్తున్నారు. – ఇచ్ఛాపురం రూరల్