శ్రీకాకుళం
విన్నపాలు విన్నారుప్రజా సమస్యల పరిష్కార వేదికలో జనం సమస్యలు ఏకరువు పెట్టారు. ఆక్రమణలపై ఫిర్యాదులు చేశారు. –8లో
ఈ ఫొటో చూస్తే మాల్దీవులో.. మరేవో దీవులు అనుకునేరు. ఇసుక దొంగల విధ్వంసానికి దీవిలా మారిపోయిన నాగావళి నది ఇది. ఆమదాలవలస నియోజకవర్గంలో కొనసాగుతున్న ఇసుక దోపిడీతో పెద్ద పెద్ద గోతులతో నదీ గర్భం మిగిలిపోయింది. అయినా అధికారులకు ఇదేమీ కనిపించడం లేదు. ఇప్పటికే ప్రోత్సహించిన అక్రమాలు చాలవని కాఖండ్యాం, పురషోత్తపురం, ముద్దాడపేడ తదితర ప్రాంతాల్లో అనుమతుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇంత దారుణంగా నాగావళి నదిని కబళిస్తుంటే అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.
ఇసుకాసురుల విధ్వంస కేళీ
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
ఆమదాలవలస నియోజకవర్గంలో కాఖండ్యాం, పురుషోత్తపురం 1, 2, ముద్దాడపేట, సింగూరు, దూసి తదితర ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా ఆగడం లేదు. కొన్నింటికి అనుమతుల ఇచ్చే విషయంలో యంత్రాంగం చోద్యం చూస్తోంది. నదులు ఏమైనా ఫర్వాలేదు తీర ప్రాంత గ్రామాలు ఏమైపోయినా అక్కర్లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అసలు వేటికి అనుమతులున్నాయో? వేటికి అనుమతుల్లేవో? తెలియని పరిస్థితి కూడా ఉంది. నది పొడవునా తవ్వకాలు జరుగుతుండటంతో అయోమయం నెలకొంది. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని నాగావళిలో రాత్రి, పగలు తేడా లేకుండా జరుగుతున్న అక్రమ తవ్వకాలు, తరలింపు చూస్తుంటే భవిష్యత్‌లో ఎలాంటి ముప్పు వాటిల్లుతోందన్న భయం సర్వత్రా నెలకొంది.
తవ్వకాలు జరపడమే కాకుండా ఆ ఇసుకను కొత్తరోడ్డు పాత బంకు దగ్గర, దూసి జంక్షన్ దగ్గరలో స్టాక్ పాయింట్‌గా డంపింగ్ చేసి, అక్కడి నుంచే లోడింగ్ చేసి విక్రయాలు సాగిస్తున్నారు. బాలకృష్ణ,
తోంది. కోట్లాది రూపాయల మేర నిర్వాహకులు సంపాదిస్తున్నారు.
రవికాంత్ తదితర వ్యక్తుల కనుసన్నల్లోనే అక్రమ దందా సాగుతోంది. అధికారుల వద్ద ఉండాల్సిన బిల్లుల సాఫ్ట్‌వేర్, డివైజ్‌లు నేరుగా నిర్వాహకుల చేతుల్లోకి వెళ్లాయి. రీచ్ నిర్వాహకులే స్వయంగా బిల్లులు రూపొందించి, లారీ డ్రైవర్లకు అందజేస్తున్నారు. దీంతో రోజుకి ఎన్ని బిల్లులు ఇస్తున్నారో, ఎంత తరలిస్తున్నారో కూడా కూడా లెక్క తెలియని దుస్థితి నెలకొంది. ఇదే విషయమై ఎమ్మెల్యే కూన రవికుమార్ అండ్ కో నిర్వాకాలపై పోరాటం చేస్తున్న సనపల సురేష్ అనే వ్యక్తి ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ స్పందన లేదు. అక్రమాలు ఆగడం లేదు. ఇసుక తవ్వకాలు, తరలింపునకు బ్రేక్ పడటం లేదు. ప్రతి రోజూ వేలాది లారీల ఇసుక అక్రమంగా తరలిపో
●ఫిర్యాదు చేశా..
ఆమదాలవలస నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఇసుక మాఫియాగా తయారై ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశాను.
– చింతాడ రవికుమార్, వైఎస్సార్ సీపీ
ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త
న్యూస్‌రీల్
ఆమదాలవలస నియోజకవర్గంలో టీడీపీ నాయకుల బరితెగింపు భయంకరంగా తయారవుతున్న నాగావళి నది వంశధారలోనూ అదే పరిస్థితి
నిర్వాహకుల చేతుల్లోకి సాఫ్ట్‌వేర్, డివైజ్‌లు
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం


