ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
గార: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివి ల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. గురువా రం అంపోలు జిల్లా జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల్లో ఇప్పటివరకు న్యాయవాది ఎవ్వరూ లేనివారికి ప్రభుత్వ న్యాయవాదులు నియమించే విషయంలో సహకరి స్తామన్నారు. బెయిల్ పిటీషిన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మహిళా బ్యారెక్‌కు వెళ్లి ముద్దాయిలతో మాట్లాడి కేసుల విషయమై వేర్వేరుగా తెలుసుకున్నారు. రానున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం లైబ్రరీ, వంటశాల, జైలు ఆవరణను పరిశీలించారు. ఆయనతో పాటు అడ్వకేట్ జి.ఇందిరాప్రసాద్, జైలర్ దివాకర్‌నాయుడు పాల్గొన్నారు.


