కూటమిలో కుమ్ములాటలు | - | Sakshi
Sakshi News home page

కూటమిలో కుమ్ములాటలు

Jun 13 2024 1:38 AM | Updated on Jun 13 2024 9:03 AM

కూటమిలో కుమ్ములాటలు

కూటమిలో కుమ్ములాటలు

కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని 17వ వార్డులో వైఎస్సార్‌ సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సీనియర్‌ నాయకుడు.. అదే వార్డులోని టీడీపీ నాయకుడు, కూటమి నేతలతో కలిసి ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీని చించివేయించడం కలకలం రేపుతున్నాయి. తొలుత ఎవరు కట్‌ చేశారో తెలియకపోయినా బుధవారం సోషల్‌మీడియాలో విడుదలైన వీడియోలు అసలు విషయాన్ని బయటపెట్టాయి. 

తన వార్డులో తన ఫొటోలు తప్పితే ఎవరి ఫొటోలు పెట్టినా ఊరుకోనని సదరు కౌన్సిలరే తన అనుచరులతో వీటిని చింపించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన అనుచరులు ఫ్లెక్సీ చింపే సన్నివేశం రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో నూతనంగా చేరి ప్రమాణ స్వీకారానికి వెళ్లిపోయి వారితో ఫోటోలకు ఫోజులు ఇస్తూ మరోవైపు దొంగచాటుగా ఫ్లెక్సీలు చింపించడం చర్చనీయాంశమైంది. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌కళ్యాణ్‌ ఫొటోలు మాత్రమే ఉంచి నాయకుడి ఫొటో చింపేయడంతో కూటమిలో కుమ్ములాట ప్రారంభమైందని పలువురు చర్చించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement