ఈవీఎంల భద్రతపై నిఘా ఉంచాలి | - | Sakshi
Sakshi News home page

ఈవీఎంల భద్రతపై నిఘా ఉంచాలి

Oct 24 2026 10:02 AM | Updated on Oct 24 2026 10:02 AM

ధర్మవరం అర్బన్‌: ఈవీఎంల భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నెలవారీ తనిఖీల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని మార్కెట్‌ యార్డులోనున్న ఈవీఎం గోడౌన్లను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్లలో ఈవీఎం యంత్రాలు, వీవీ ప్యాట్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. లాగ్‌ బుక్‌లు, సెక్యూరిటీ గార్డుల హాజరును తనిఖీ చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ల వద్ద ఎప్పటికప్పుడు ప్రత్యేక భద్రత ఉండాలని తెలిపారు. గోడౌన్‌ వద్ద సీసీ కెమెరా వ్యవస్థ, ఫైర్‌ సేఫ్టీ, 24 గంటల భద్రతా ఏర్పాట్లపై నిఘా ఉంచాలని అధికారులకు తెలియజేశారు. గోడౌన్‌ లోపల తేమ చేరకుండా వైరింగ్‌ పక్కాగా ఉండేలా చూసుకోవాలని, అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఏర్పాటు చేయాలని, అలానే ముందు జాగ్రత్తగా అగ్నిమాపక పరికరాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఆర్డీఓ రామభూపాల్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరమణయ్య, తహసీల్దార్‌ దేవరాజ్‌, రెవెన్యూ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement