నేడు మద్యం దుకాణాల బంద్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు మద్యం దుకాణాల బంద్‌

Oct 2 2026 5:26 AM | Updated on Oct 2 2026 5:26 AM

పుట్టపర్తి టౌన్‌: గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం (నేడు) జిల్లా వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు జిల్లా ప్రొహిబేషన్‌, ఎకై ్సజ్‌ అధికారి నరసింహులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు మద్యం షాపులు బంద్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఉచిత శిక్షణకు

దరఖాస్తుల ఆహ్వానం

పుట్టపర్తి: యూపీపీఎస్సీ (సివిల్స్‌)కి సిద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ వెల్ఫేర్‌ అధికారి రమేష్‌ తెలిపారు. అర్హులు ఈనెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 27న పరీక్ష ఉంటుందని, ఉత్తీర్ణులైన వారందరికీ ఉచిత శిక్షణ అందిస్తామన్నారు. వివరాలకు 9989980701 నంబరులో సంప్రదించాలన్నారు.

మోడల్‌ స్కూల్‌

ప్రిన్సిపాల్‌ సస్పెండ్‌

పుట్టపర్తి అర్బన్‌: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి మండల పరిధిలోని జగరాజుపల్లి మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రాణా ప్రతాప్‌ నాయక్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు గురువారం ఆర్జేడీ శామ్యూల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్‌ 18వ తేదీన కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అనిల్‌కుమార్‌, సమగ్ర శిక్ష పీడీ రవీంద్రనాథ్‌రెడ్డి, ఏపీడీ దేవానందరెడ్డి, ఆర్‌జేడీ శామ్యూల్‌, డీఈఓ కిష్టప్ప తదితరులు మోడల్‌స్కూల్‌ను సందర్శించారు. కేంద్రం మంజూరు చేసిన ‘పీఎంశ్రీ’ నిధుల వినియోగం, పాఠశాల స్థితిగతులు, విద్యార్థుల అభ్యసనా సామర్థాలను అధికారుల పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణలో పలు లోపాలను గుర్తించారు. కుళ్లిన కోడిగుడ్లు, రికార్డులు నిర్వహణ సరిగా లేకపోవడం, వంటగదిలో పాము కనిపించడం, మరుగుదొడ్లకు వాడే ఫినాయిల్‌, ఇతర వస్తువులను వినియోగించకుండా నిల్వ చూపడం, బియ్యం బస్తాల్లో తేడాలు ఉండడం.. ఇలా పలు అంశాలను గమనించిన అధికారులు.. ప్రిన్సిపాల్‌పై చర్యలకు ఆదేశించారు. దీంతో ఏడీ వినయ్‌ మోహన్‌ మరోసారి విచారణ చేసి నివేదికను పంపారు. ఈ నేపథ్యంలోనే రాణా ప్రతాప్‌ నాయక్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ కార్యాలయ అధికారులు తెలిపారు.

ఆరు మండలాల్లో

కరువు లేదంట !

● అనంతలో 28, శ్రీసత్యసాయిలో

29 కరువు మండలాలు

● ప్రభుత్వ ఉత్తర్వులపై అసంతృప్తి

అనంతపురం అగ్రికల్చర్‌: నైరుతి రుతపవనాలు ఏ మాత్రం ప్రభావం చూపకపోవడంతో ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షాలు లేక పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం కరువు మండలాలను ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అనంతపురం జిల్లాలో రాయదుర్గం, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, అనంతపురం అర్బన్‌ మండలాలకు అన్యాయం చేస్తూ 28 మండలాలను కరవు జాబితాలో ప్రకటించింది. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో అగళి, రొళ్ల, పెనుకొండ మండలాలను పక్కనపెట్టి మిగిలిన 29 మండలాలను కరువు జాబితాలో చేర్చింది. గుమ్మగట్ట, రొద్దం మండలాలను మధ్యస్తంగానూ మిగిలిన వాటిని తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కరువుంటే ఆరు మండలాలను పక్కన పెట్టడం సరికాదని రైతులు, వివిధ పార్టీల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పొలాల్లో రక్త పింజరి

కళ్యాణదుర్గం రూరల్‌: మండల పరిధిలోని ఎర్రంపల్లి సమీపంలోని పంట పొలాల్లో గురువారం రక్త పింజరి కలకలం రేపింది. వ్యవసాయ పొలాల్లో పనులు చేస్తున్న రైతులకు కనిపించడంతో రైతులు, వ్యవసాయ కూలీలు భయాందోళనకు గురయ్యారు. రైతులు గట్టిగా కేకలు వేయడంతో రక్తపింజరి సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయింది. అటవీశాఖ అధికారులు స్పందించి కొండచిలువ, రక్తపింజరి, ఎలుగుబంట్ల బారి నుంచి కాపాడాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement