‘పచ్చ’నేతలపై ప్రజల తిరుగుబాటు | - | Sakshi
Sakshi News home page

‘పచ్చ’నేతలపై ప్రజల తిరుగుబాటు

Oct 2 2026 5:26 AM | Updated on Oct 2 2026 5:26 AM

ధర్మవరం: ‘మీరు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. ఒక్క పింఛన్‌ అయినా మంజూరు చేశారా.? ఎన్నికలొస్తున్నాయని పింఛన్లని హడావుడి చేశారు. నేతన్నలు పింఛన్‌ కోసం దరఖాస్తుకు వెళితే సచివాలయంలో తీసుకోరు. చివరకు చేనేతలకు ఇచ్చే సాయాన్ని మీరంతా ఏకమై నీకు సగం.. నాకు సగం అని పంచుకు తింటారా..ఇందుకేనా మీకు ఓట్లు వేసి గెలిపించింది’ అంటూ పట్టణంలోని 8వవార్డుకు చెందిన పలువురు చేనేత కార్మికులు సచివాలయ సిబ్బంది, టీడీపీ వార్డు ఇన్‌చార్జ్‌ ధనుంజయ నాయుడుపై తిరగబడ్డారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అర్హులకు అన్యాయం చేశారని వాగ్వాదం

గురువారం పట్టణంలోని 8వ వార్డులో ఉదయం సచివాలయ సిబ్బంది గోపీనాయక్‌, టీడీపీ వార్డు ఇన్‌చార్జ్‌ ధనుంజయ నాయుడు పింఛన్లు పంపిణీ చేసేందుకు వెళ్లారు. ఇంతలో అక్కడ ఉన్న చేనేత కార్మికులు సచివాలయ సిబ్బంది వద్దకు వెళ్లి పింఛన్‌ దరఖాస్తు చేసుకునేందుకు వెళితే అక్కడెక్కడో టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద ఇవ్వమంటారు...? చేనేత అర్హత సర్టిఫికెట్‌ కోసం వెళితే డబ్బులు వసూలు చేస్తారు..? ఇటీవల ఇచ్చిన ‘నేతన్న సేవలో’ పథకంలోనూ కార్మికులకు ఇచ్చే రూ.25 వేల సాయం అర్హులకు అందించకుండా అన్యాయం చేశారని వాగ్వాదానికి దిగారు. దీంతో వారికి సమాధానం చెప్పలేక టీడీపీ వార్డు ఇన్‌చార్జ్‌ ధనుంజయనాయుడు ‘‘మేము అవినీతి చేయలేదు ఆఫ్‌లైన్‌లో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయో తెలియదు... అయిన మీకు న్యాయం చేస్తాం’’ అంటూ సమాధానం ఇవ్వడంతో చేనేత కార్మికుల ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. ‘అసలు నువ్వెవరయ్యా మాకు న్యాయం చేసేందుకు’ అంటూ ఎదురు తిరగడంతో ఏం చేయాలో తెలియని సదరు టీడీపీ నాయకుడు, సచివాలయ సిబ్బంది అక్కడి నుండి ఉడాయించారు.

కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారో

చెప్పాలని నిలదీత

టీడీపీ వార్డు ఇన్‌చార్జ్‌ని

ఘెరావ్‌ చేసిన చేనేత కార్మికులు

ధర్మవరం 8వ వార్డులో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement