ఎత్తు వేస్తే.. ప్రత్యర్థి చిత్తే! | - | Sakshi
Sakshi News home page

ఎత్తు వేస్తే.. ప్రత్యర్థి చిత్తే!

Oct 2 2026 5:26 AM | Updated on Oct 2 2026 5:26 AM

● చదరంగంలో రాణిస్తున్న

‘పురం’ చిచ్చర పిడుగులు

● అంతర్జాతీయ

ఫిడే రేటింగ్‌తో

ప్రత్యేక గుర్తింపు

హిందూపురం టౌన్‌: పట్టణానికి చెందిన ఇద్దరు చిన్నారులు చెస్‌లో సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ ఫిడే రేటింగ్‌ దక్కించుకుని ప్రత్యేక గుర్తింపు పొందారు.

తొమ్మిదేళ్లకే అంతర్జాతీయ స్థాయికి..

పట్టణానికి చెందిన ఏ.మిథుల్‌ మౌర్యకు నిండా తొమ్మిదేళ్లు లేవు. కానీ చెస్‌లో అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకున్నాడు. వినికిడి లోపం ఉన్న మిథుల్‌ చిన్నప్పటి నుంచే చెస్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో... కోచ్‌ ఆరీఫుల్లా వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. చెస్‌బోర్డునే తన భవితకు మార్గంగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఎత్తుకు పైఎత్తు వేస్తే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ చెక్‌ చెప్పేవాడు. అనతికాలంలోనే రాష్ట్రస్థాయికి ఎదిగిన మిథుల్‌ సెప్టెంబర్‌ 11 నుంచి 13 వరకు హైదరాబాద్‌లో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ క్లాసికల్‌ ఓపెన్‌ బిలో 1,800 చెస్‌ టోర్నమెంట్‌‘లో సత్తా చాటాడు. నాలుగు దేశాలకు చెందిన 921 మంది క్రీడాకారులు పాల్గొన్న టోర్నీలో మిథుల్‌ తనదైన ఆటతో మహామహులకు చెక్‌ పెట్టాడు. దీంతో అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య ఆటగాళ్ల ప్రతిభను అంచనా వేస్తూ ఇచ్చే ఫిడే రేటింగ్‌లో 1,467 ర్యాంకు దక్కించుకున్నాడు. అలాగే ఆగస్టు 16న బెంగళూరులో జరిగిన ‘బెంగళూరు ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ ఫిడే రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌లోనూ రాణించి 1,445 ఫీడే రాపిడ్‌ ఇంటర్నేషనల్‌ రేటింగ్‌ సాధించాడు.

వశిష్టకూ మెరుగైన ర్యాంకు..

పట్టణానికే చెందిన చెస్‌ క్రీడాకారుడు ఎంవీ వశిష్టకు అంతర్జాతీయ ఫిడే రేటింగ్‌లో మెరుగైన ర్యాంకు దక్కింది. ఆగస్టు 16న బెంగళూరులో జరిగిన ‘బెంగళూరు ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ ఫీడే ఆపరేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో వశిష్ట సత్తా చాటాడు. దీంతో అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య వశిష్టకు 1,544 రేటింగ్‌ ఇచ్చి గుర్తించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement