ఇసుక, మట్టి అక్రమ రవాణాపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

ఇసుక, మట్టి అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Jul 29 2026 12:10 AM | Updated on Jul 29 2026 12:10 AM

పరిగి: ఇసుక, మట్టి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్‌ హెచ్చరించారు. మంగళవారం ఆయన పరిగి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. తొలుత స్టేషన్‌లో లాకప్‌ గదులు, స్టేషన్‌ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, పెండింగ్‌ కేసుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రతి ఒక్కరూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అంకిత భావంతో పనిచేయండి

పుట్టపర్తి టౌన్‌: పోలీస్‌ శాఖలో హోంగార్డు వ్యవస్థ ఎంతో కీలకమని ప్రతి హోంగార్డు క్రమ శిక్షణ, అంకిత భావంతో విధులు నిర్వహించాలని ఎస్పీ సతీష్‌ కుమార్‌ సూచించారు. మంగళవారం పుట్టపర్తి పట్టణంలో సాయి ఆరామంలో హోంగార్డుల ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ సతీష్‌ కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డులు విధులతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలన్నారు. చట్ట వ్యతిరేక వ్యవహారాలకు దూరంగా ఉండాలన్నారు. సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో హోంగార్డుల కమాండెంట్‌ హనుమంతప్ప, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు, హోంగార్డుల డీఎస్పీ హరికృష్ణ, ఆర్‌ఐలు వలి పాల్గొన్నారు.

ఎస్పీ సతీష్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement