జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్‌ | - | Sakshi
Sakshi News home page

జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్‌

Jun 30 2026 3:11 AM | Updated on Jun 30 2026 3:11 AM

మడకశిర: ౖవెఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప హెచ్చరించారు. జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ రూరల్‌ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ పట్టణంలో సోమవారం ఈరలక్కప్ప, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు వైసీ గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ర్యాలీగా వెళ్లి స్థానిక అప్‌గ్రేడ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ర్యాలీలో పంతం నానాజీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఈరలక్కప్ప, వైసీ గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే వైఎస్‌ జగన్‌ అత్యంత ప్రజా బలం కలిగిన నాయకుడని తెలిపారు. రాష్ట్రంలో 5 ఏళ్ల వైఎస్‌ జగన్‌ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచి పోయిన జగన్‌పై కూటమి నాయకులు అవాకులు, చవాకులు మాట్లాడడం సరికాదన్నారు. జగన్‌పై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని విమర్శించారు. కూటమి నాయకులు తమ భాష మార్చుకోకపోతే రాష్ట్రంలో ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. జగన్‌కు పెరుగుతున్న ఆదరణను కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. పంతం నానాజీని అరెస్ట్‌ చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. నీతులు చెప్పే పవన్‌కల్యాణ్‌ తన సొంత పార్టీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ కల్లుమర్రి శ్రీరాములు, పట్టణ కన్వీనర్‌ ఓంకుమార్‌, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు నరసింహమూర్తి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రామిరెడ్డి, అగళి మండల కన్వీనర్‌ శ్రీనివాస్‌, పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణ్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి తిప్పేస్వామి, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి సత్యనారాయణయాదవ్‌, మాజీ డైరెక్టర్‌ నాగరాజు, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు తిమ్మారెడ్డి, జిల్లా ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి నరసింహ, జిల్లా ఎస్సీ సెల్‌ కార్యదర్శి లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీరాజ్‌ విభాగం ఉపాధ్యక్షుడు చిరంజీవి, పబ్లిసిటీ వింగ్‌ అధ్యక్షుడు సికిందర్‌, మండల యూత్‌ విభాగం అధ్యక్షుడు హరి, స్థానిక నాయకులు నర్సేగౌడ్‌, బాలక్రిష్ణారెడ్డి, హనుమంతప్ప, సుధాకర్‌, సురంగల నాగరాజు, మంజునాథ్‌ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీని వెంటనే అరెస్ట్‌ చేయాలి

వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త

ఈరలక్కప్ప

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement