●ఎస్పీ సతీష్‌కుమార్
పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదులు పునరావృతమైతే చర్యలు తప్పవని ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పరిష్కార వేదిక నిర్వహించారు. ఎస్పీ సతీష్‌కుమార్ 72 వినతులు స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. సమస్య తీవ్రతను తెలుసుకుని చట్టపరిధిలో విచారించి పరిష్కారం చూపుతామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, డీటీఆర్‌బీ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, సీఐ బొజ్జప్ప తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌హెచ్‌ఎమ్‌ఎస్‌తో చోరీలకు చెక్
పుట్టపర్తి టౌన్: ఇళ్లల్లో జరిగే చోరీలకు చెక్ పెట్టేందుకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎమ్‌ఎస్) సేవలు ప్రారంభిస్తున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో సేవలను అడిషనల్ ఎస్పీ అంకిత సురానాతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఎల్‌హెచ్‌ఎమ్‌ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.


