కదిరి టౌన్: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై సోమవారం కదిరి పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. నానాజీపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ బాబ్జాన్, బీసీ సెల్ అధ్యక్షుడు రామచంద్ర,యూత్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు రమేష్‌యాదవ్, పట్టణ అధ్యక్షుడు బాబా, వాణిజ్య విభాగం అధ్యక్షుడు షకీల్, వైస్ ప్రెసిడెంట్ మహబూబ్ బేగ్, బూత్ కన్వీనర్ ఎహెసాన్, మొహిద్దీన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిన్నరెడ్డప్ప, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి గంగాధర్, సాదత అలీ తదితరులు పాల్గొన్నారు.


