పీర్ల పండక్కొచ్చి తిరిగిరాని లోకాలకు... | - | Sakshi
Sakshi News home page

పీర్ల పండక్కొచ్చి తిరిగిరాని లోకాలకు...

Jun 29 2026 2:05 AM | Updated on Jun 29 2026 2:05 AM

బత్తలపల్లి: ఇంటి పైకప్పు పెచ్చులూడి పడడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడిన సంఘటన బత్తలపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాలమేరకు... బత్తలపల్లిలోని పాతూరుకు చెందిన మీసాల రామప్ప కుమార్తె ఉషతో పాటు ఆమె కుమార్తె రిషిత (11) పీర్ల పండుగ జరుపుకుందామని ముదిగుబ్బ నుంచి వచ్చారు. శనివారం పండుగ చూసుకొని అందరూ కలిసి బత్తలపల్లిలోని పాతూరులోని రామప్ప ఇంట్లో నిద్రించారు. అయితే తెల్లవారుజామున ఇంటి పై కప్పు పెచ్చులు ఒక్కసారిగా కూలి వారిపై పడడంతో రిషిక (11), తల్లి ఉష, అమ్మమ్మ కోనమ్మకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. రిషిక తల మీద నేరుగా పెచ్చులు పడటంతో ఆస్పత్రికి చేరుకునేలోపు మృతి చెందింది. ఉష, కోనమ్మలను మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

నేడు డయల్‌ యువర్‌

ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్‌ యువర్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్‌ లోతేటి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ సమస్యలున్న వినియోగదారులు సెల్‌: 8977716661లో ఫిర్యాదు చేయాలన్నారు.

ఇంటి పైకప్పు పెచ్చులూడి బాలిక మృతి

తల్లి, అవ్వకు తీవ్రగాయాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement