గంధం అలంకరణలో శ్రీవారు | - | Sakshi
Sakshi News home page

గంధం అలంకరణలో శ్రీవారు

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

హిందూపురం: స్థానిక పేట వేంకటరమణ స్వామి ఆలయంలో సోమవారం అక్షయ తృతీయ సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు పెద్ద ఎత్తున జరిగాయి. తెల్లవారుజామున మూలవిరాట్‌ను పంచామృతాభిషేకాల అనంతరం అక్షయ సమానమైన సుగంధ ద్రవ్యాలతో అలంకరించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత పేట వేంకటరమణస్వామి ఉత్సవమూర్తులను పల్లకీలో అధిష్టింపజేసి ప్రాకారోత్సవం నిర్వహించారు. అలాగే పట్టణంలోని కొల్హాపురి మహాలక్ష్మి ఆలయంలో సోమవారం విశేష అభిషేకాలు, అర్చనలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం లలిత సహస్ర నామపారాయణంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement