ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలి
హిందూపురం: తమకు ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. మంగళవారం యునైటెడ్ ఫోరం బ్యాంక్ ఎంప్లాయీస్ పిలుపు మేరకు హిందూపురం బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక స్టేట్‌బ్యాంక్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ప్రసన్నకుమార్, పణిభూషణ్ కృష్ణ మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జెడ్పీ శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యుడు వీఆర్ రాములు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఉదాసీన వైఖరిని వీడాలన్నారు. బ్యాంకు ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. మోదీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్‌లను ప్రవేశ పెడుతోందని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెలో అందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజశేఖర్, సురేష్ ,మారుతిష్, శశి, రంగనాథ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకు ఉద్యోగుల డిమాండ్


