సాయి సన్నిధిలో సంక్రాంతి వేడుకలు
ప్రశాంతి నిలయం: స్థానిక ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహాసమాధి చెంత సంక్రాంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. యజుర్ మందిరం వద్ద నుంచి వేదమంత్రాలు, బ్రాస్ బ్యాండ్ వాయిద్యంతో సత్యసాయి చిత్ర పటాన్ని ఊరేగింపుగా సాయి కుల్వంత సభామందిరానికి చేర్చారు. సాయంత్రం భక్త హనుమాన్ నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. క్రీడా సాంస్కృతిక సమ్మేళనం ముగింపు వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు నిర్వహించిన నాటికతో భక్తులు పరవశించి పోయారు. అనంతరం సత్యసాయి విద్యాసంస్థల సాంస్కృతిక క్రీడా సమ్మేళనంలో ప్రతిభ చాటిన వారికి ట్రోఫీలు, జ్ఙాపికలను ప్రదానం చేశారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌రాజు, సత్యసాయి విద్యాసంస్థల చాన్సలర్ చక్రవర్తి, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాఘవేంద్ర ప్రసాద్, దేశవిదేశాలకు చెందిన పలువురు భక్తులు పాల్గొన్నారు.
సాయి సన్నిధిలో సంక్రాంతి వేడుకలు
సాయి సన్నిధిలో సంక్రాంతి వేడుకలు
సాయి సన్నిధిలో సంక్రాంతి వేడుకలు
సాయి సన్నిధిలో సంక్రాంతి వేడుకలు
సాయి సన్నిధిలో సంక్రాంతి వేడుకలు


